ఈనెల 8వ తేదీన జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడికి షాక్ తప్పేట్లు లేదు.  జరగబోయే పోలింగ్ సరళిపై సర్వేలు నిర్వహిస్తున్న సంస్ధలన్నీ ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కే పట్టం కడుతున్నాయి.  2014లో జరిగిన ఎన్నికల్లో కూడా  బిజెపికి దెబ్బ పడింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ హోదాలో సిఎం అయిన కేజ్రీవాల్ ను కేంద్రం ఎంతగా ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలిసిందే.

 

వివిధ రకాలుగా  కేంద్రం  వేధించటంతో విసిగిపోయిన కేజ్రీవాల్ చివరకు ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్ళారు. రెండోసారి జరిగిన ఎన్నికల్లో మొత్తం 70 సీట్లకు గాను కేజ్రీవాల్ నేతృత్వంలోని  ఆమ్ ఆద్మి పార్టీ (ఆప్) కి జనాలు 67 సీట్లిచ్చారు. దాంతో మోడికి దిమ్మ తిరిగిపోయింది. అంటే దేశమంతా తన గాలి కనిపించినా ఢిల్లీలో మాత్రం తన హవా ఎక్కడా పనిచేయలేదని తేలిపోయింది.

 

బంపర్ మెజారిటితో కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చినా  కేంద్రప్రభుత్వం మాత్రం ఏదో రకంగా సిఎంను ఇబ్బందులు పెడుతునే ఉంది. అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా కేజ్రీవాల్ మాత్రం తాను అనుకున్నట్లుగా సంక్షేమ పథకాలతో ముందుకెళుతునే ఉన్నాడు. సీన్ కట్ చేస్తే 2019లో కూడా దేశవ్యాప్తంగా మోడి గాలి ఏ విధంగా వీచిందో అందరూ చూసిందే.

 

మొన్నటి లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి దెబ్బతిన్నది. ఇందులో భాగంగానే ఈనెల 8వ తేదీన జరిగే పోలింగ్ పై దేశవ్యాప్తంగా ఆశక్తి పెరిగిపోతోంది. అందుకనే అనేక సంస్ధలు ఒకటికి పదిసార్లు ఓటర్ల నాడిని తెలుసుకునేందుకు నానా అవస్తలు పడుతున్నాయి. సరే సర్వేల్లో తేలిందేమంటే జనాలందరూ మళ్ళీ కేజ్రీవాల్ కే పట్టం కట్టబోతున్నారని.  ఎందుకంటే సంక్షేమ పథకాల అమలుతో జనాలను సిఎం ఆకట్టుకుంటున్నట్లు తేలింది. జాతీయ అంశాలకన్నా ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే కీలక పాత్ర పోషించబోతోందని తేలిపోయింది. సర్వే రిపోర్టులే వాస్తవమైతే మోడికి మళ్ళీ షాక్ ఖాయమే.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: