పార్టీ రాజకీయం ఏ విధంగా ఉంటుందో సామాన్య జనానికి ఒక పట్టాన అర్థం కావడం లేదు. రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ జనాలను గందరగోళంలోకి నెట్టేస్తుంటాయి. అలాగే ఏపీలో బలమైన పార్టీగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్న బిజెపి దానిలో భాగంగానే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంది. జనసేనను ఉపయోగించుకుని టిడిపి వైసిపి కి  ప్రత్యామ్నాయ శక్తిగా ఏపీలో ఎదగాలని ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కకపోవడం,ఇప్పటికీ ఆ పార్టీ అవమానంగా భావిస్తోంది. తాము ఒంటరిగా ఎన్నికల బరిలోకి వెళ్తే 2024 ఎన్నికల్లోనూ ఇదే రకమైన చేదు ఫలితాలే వస్తాయని భావించే  జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది.


ఇక ఆ పొత్తు తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జనసేన కీలక నాయకుడిగా ఉన్న సీబీ మాజీ జేడీ లక్ష్మి నారాయణ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఇదంతా పవన్ మీద ఉన్న కోపంతోనే రాజీనామా చేశారని అంతా భావిస్తూ వచ్చారు. దీని వెనుక బీజేపీ ఉన్నట్టుగా ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని సంగతులు బయటకు వస్తున్నాయి. జనసేన తో బీజేపీ పొత్తు ఉన్నా లేకపోయినా విశాఖ నుంచి బరిలోకి దిగేందుకు పూర్తిస్థాయిలో సిద్ధం అవుతున్న లక్ష్మి నారాయణను తప్పించి అక్కడ దగ్గుపాటి పురంధరేశ్వరిని యాక్టివ్ చేసేందుకు బీజేపీ పావులు కదిపిందట. 


అదీకాకుండా ఏపీలో బలపడేందుకు  ముందుచూపుతో పవన్ చేరదీసి హడావిడిగా ఢిల్లీకి పిలిపించి మరీ పొత్తు పెట్టుకున్నారు.  తర్వాత పరిణామాల నేపథ్యంలో పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ జేడీ పార్టీ నుంచి బయటకి వచ్చారు. పవన్ సినిమాల్లో నటించనని ముందుగా చెప్పారని, కానీ సినిమాల్లో మళ్ళీ ఎంట్రీ ఇచ్చి అందరినీ మోసం చేశారంటూ ఆరోపిస్తూ జనసేన నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన మాజీ సిబిఐ జెడి లక్ష్మీనారాయణ ఆరోపణలు చేస్తూ రాజీనామా చేశారు.  అయితే ఆయన స్థానంలో పురంధరేశ్వరిని యాక్టివ్ చేసినది జేడీని ఒప్పించి మరి జనసేన కు రాజీనామా చేయించి నట్టుగా తెలుస్తోంది. 


ఆయనకు బిజెపి అండదండలు ఉన్న కారణంగానే ఆయన నిన్న కూడా ఓ సమావేశంలో మాట్లాడుతూ బడ్జెట్ బాగుందని, బిజెపి ఆధ్వర్యంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అంటూ వ్యాఖ్యానించారు అనే విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ తరపున రాజ్యసభ స్థానం ఇవ్వడంతో పాటు, కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని, దానిలో భాగంగానే బిజెపి చెప్పినట్టుగా జేడీ జనసేనకు రాజీనామా చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా పవన్ కు తెలిసి జరిగిందో తెలియక జరిగిందా అనేది తేలాల్సి ఉంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: