నేటి యువత మనోభావం మారుతోంది. పెళ్లి విషయంలో ఒక క్లారిటీకి వచ్చేసింది. అమ్మానాన్నలను గౌరవిస్తూనే.. జీవితంలో ఉద్యోగం సంపాదించిన తర్వాతే పెళ్లి చేసుకుంటామంటూ స్పష్టత ఇచ్చేసింది. ఇలా పెద్ద పెద్ద మెట్లు చకచకా ఎక్కేయాలని తాపత్రయపడుతున్నారు నేటి యువత.... మూడు ముళ్ల గురించి మూడు పదులు దాటే వరకు ఆలోచించడమే లేదు. కెరీర్ కోసం పెళ్లికి దూరంగా ఉండేవారు కొంద‌రైతే.. అమ్మాయిలు దొర‌క‌క పెళ్లికాని ప్ర‌సాద్‌లుగా ఉన్నారు. వాస్త‌వానికి గతంలో అబ్బాయిల కోసం అమ్మాయిల తల్లిదండ్రులు వేట సాగించేవారు. అలాంటిది నేడు అమ్మాయిల కోసం అబ్బాయిల తల్లిదండ్రులు అన్వేషణ చేస్తున్నారు. 

 

మ్యారేజ్‌బ్యూరోలు, వివాహ పరిచయ వేదిక కార్యక్రమంలో అమ్మాయిల కోసం అబ్బాయిలు పోటీ పడుతున్నారు. ఏకంగా కొన్ని కులాల్లో అయితే అమ్మా యిలకే ఎదురుకట్నం వచ్చి వివాహం చేసుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి స‌మ‌స్యే ఓ వ్య‌క్తి ఎదురైంది. ప్ర‌స్తుతం ఆయ‌న ఏజ్ జ‌స్ట్ 63. అయిన‌ప్ప‌టికీ ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా వ‌ధువు కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే పంచాయితీ ఆఫీసుకు తనకు వధువు కావాలని దరఖాస్తు పెట్టుకుంటే..ఆశ్చర్యపోవడం అక్కడ సిబ్బంది వంతైయ్యింది. వివరాల్లోకి వెళ్తే..63 ఏళ్ల పెళ్లికాని వ్యక్తి ఇప్పుడు ఒక కుటుంబాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాడు.

 

తన కోసం ఒక అమ్మాయిని కనుగొనమని కోరుతూ గ్రామ పంచాయతీకి ఒక దరఖాస్తును అందజేశాడు. ఈ సంఘటన హవేరి జిల్లాలోని హంగల్ తాలూకాలోని నరేగల్ గ్రామంలో జరిగింది. హౌసింగ్ స్కీమ్ కింద నివాసాలకు, ప్రభుత్వ పథకాల కింద ప్రయోజనాలకు దరఖాస్తులు తీసుకునే పంచాయతీ అధికారులకు, వృద్ధుడికి వధువును కనుగొనడానికి ఒక అభ్యర్థనను అందుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈయన ఇచ్చిన దరఖాస్తులో.. ధ్యామన్న కమ్మర్ (63) తన సొంత కులానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కోరాడు. 

 

అతను దయామవ మందిరానికి పూజారి అని, అవివాహితుడనని, తగిన అమ్మాయి కోసం ఇప్పటివరకు చేసిన అన్వేషణ విఫలమైందని చెప్పాడు. ‘నాకు ఆహారం వండడానికి ఎవరూ లేరు. అందువల్ల నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. నా పెళ్ళికి మీరు ఒక అమ్మాయిని వెతకాలి’ అని ఆయన దరఖాస్తులో పేర్కొన్నారు. అలాగే కొంతమంది గ్రామ పంచాయతీ సభ్యులు కూడా ధ్యామన్న దరఖాస్తుకు మ‌ద్ద‌తు తెలుపుతూ సంత‌కం కూడా చేశారు. దీంతో పంచాయతీ అభివృద్ధి అధికారి దైమన్న దరఖాస్తును స్వీకరించి రసీదు ఇచ్చారు. మ‌రి ఈ జ‌స్ట్ 63 ఏళ్ల ఓల్డ్ మ్యాన్‌కు వ‌ధువు దొరుకుతుందో.. లేదో.. చూడాలి.

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: