నాగార్జున యూనివర్సిటీ వీసీ ఈరోజు జై అమరావతి అంటూ నినాదాలు చేసిన నలుగురు విద్యార్థుల సస్పెన్షన్ ను ఎత్తివేశారు. ఈరోజు ఉదయం వీసీ ఈ మేరకు ఊతర్వులను జారీ చేశారు. శనివారం నాగార్జున యూనివర్సిటీ వీసీ నలుగురు విద్యార్థులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జై అమరావతి అంటూ నినాదాలు చేసినందుకు విద్యార్థులను సస్పెండ్ చేయడంతో వీసీపై విమర్శలు వ్యక్తమయ్యాయి.         
 
సొషల్ మీడియాలో ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తెలుగుదేశం పార్టీ నేతలతో పాటీ నెటిజన్లు కూడా వీసీపై విమర్శలు చేశారు. సస్పెన్షన్ విషయంలో విమర్శలు వ్యక్తమవుతూ ఉండటంతో వీసీ వెనక్కు తగ్గారు. నలుగురు ఆచార్య యూనివర్సిటీ విద్యార్థులు రెండు రోజుల క్రితం విద్యార్థుల జేఏసీ ఆధ్వర్యంలో అమరావతికి మద్దతుగా చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు జై అమరావతి అంటూ నినాదాలు చేయడంతో వీసీ విద్యార్థులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి నారా లోకేష్ విద్యార్థులను సస్పెండ్ చేసిన ఆర్డర్ కాఫీని ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. వర్సిటీ అధికారుల తీరుపై గల్లా జయదేవ్, నారా లోకేశ్ విమర్శలు చేశారు. విద్యార్థులను సస్పెండ్ చేసి సస్పెన్షన్ ను వెనక్కు తీసుకున్నా విద్యార్థులు మాత్రం వీసీ రాజీనామా చేయాలని ధర్నాకు దిగారు. 
 
అమరావతి పరిరక్షణ ఏజెంట్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఈరోజు ధర్నాకు దిగారు. వీసీ అన్యాయంగా విద్యార్థులను సస్పెండ్ చేశారని యూనివర్సిటీలో మూడు రాజధానులకు అనుకూలంగా చేపట్టిన ర్యాలీలో వీసీ పాల్గొన్నాడని అందువలన వీసీ రాజీనామా చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వర్సిటీ నిర్వాహకులు యూనివర్సిటీ ఆవరణలో పోలీసులను మోహరించారు. ఈ వివాదం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: