ఏపీ సీఎం జగన్ ఈరోజు విశాఖలోని శారదాపీఠంకు వెళ్లారు. శారదా పీఠంలో జరిగిన పూర్ణాహుతి మరియు విశ్వశాంతి మహా యాగంలో సీఎం జగన్ పాల్గొన్నారు. జగన్ రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గడచిన ఐదు రోజులుగా ఆగమ యాగశాలలో విశ్వశాంతి హోమం జరుగుతోంది. ఈ హోమం పూర్ణాహుతి యాగంలో ఈరోజు సీఎం జగన్ పాల్గొన్నారు. పీఠాధిపతులైన స్వాత్మానంద్రేంద్ర, స్వరూపానందేంద్ర ఆశీస్సులను సీఎం జగన్ అందుకున్నారు.                     
 
జమ్మిచెట్టు, గోమాతకు జగన్ ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆ తరువాత తత్త్వమసి గ్రంథాన్ని జగన్ స్వీకరించారు. ఏపీ సీఎం జగన్ పూజల అనంతరం స్వయం జ్యోతి మండపం శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. సీఎం జగన్ టీటీడీ చేపట్టిన శ్రీనివాస చతుర్వేది హవనం పూర్ణాహుతిలో కూడా జగన్ పాల్గొన్నారు. శారదాపీఠంలో జరిగిన ఈ యాగంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా పాల్గొనడం గమనార్హం. 
 
సీఎం జగన్ చేతుల మీదుగా శ్రౌత మహాసభలో ఉత్తమ పండితునికి స్వర్ణ కంకరాధణ చేయనున్నారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంత్రి ఆవంతి శ్రీనివాస్ కూడా శారదా పీఠంలో జరిగిన యాగంలో పాల్గొన్నారు. సీఎం జగన్ సంప్రదాయ వస్త్రాలలో ఈరోజు జరిగిన యాగంలో పాల్గొన్నారు. 
 
పూర్ణ కంభంతో జగన్ కు ఘన స్వాగతం లభించింది. పీఠం వార్షిక మహోత్సవం సందర్భంగానే ఈ యాగానికి సీఎం జగన్ హాజరయ్యారని అంతకు మించే ప్రత్యేకమైన కారణాలేమీ లేవని సమాచారం. ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై కూడా శారదా పీఠాన్ని సందర్శించనున్నారు. సీఎం జగన్ రాకతో పోలీసులతో శారదా పీఠం దగ్గర భారీగా బందోబస్త్ ఏర్పాటు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: