ఈ రోజుల్లో గర్ల్ ఫ్రెండ్ లేకుండా అసలు ప్రపంచమే లేదు అన్నట్టు గా ఉంటున్నారు నేటితరం యువత. ఇక గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలను ఆకర్షించి  గర్ల్ ఫ్రెండ్ చేసుకోవడానికి యువకులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎంతో స్టైల్ గా  రెడీ అవ్వడం... మంచి మంచి బైక్ లు  వేసుకుని తిరగడం లాంటివి చేస్తూ ఉంటారు.ఇవన్నీ చేసిన అమ్మాయిలు పడతారు అన్న నమ్మకం మాత్రం తక్కువే. ఒకప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంటే విచిత్రంగా చూసేవారు కానీ ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ లేని వారు ఉన్నారు అంటే కింద నుంచి మీద  వరకు ఎంతో విచిత్రంగా చూస్తూ ఉంటారు. అంతేకాదండోయ్ పలు పబ్బులు  రెస్టారెంట్లు షాపింగ్ మాల్లు కూడా... స్టాగ్స్ నో ఎంట్రీ బోర్డు పెడుతున్నారు 

 


 ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకోండి... ఎంచక్కా చెట్టపట్టాలేసుకుని బైక్ పై  తిరగడం.. రెస్టారెంట్లు పబ్బులు అంటూ తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉండటం... లాంటివి చేస్తూ ఉంటారు. షాపింగ్ విషయానికొస్తే అయితే.... అవసరం లేకుండా తెగ షాపింగ్ చేసేస్తూ... భారీగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే  ఈ మధ్య కాలంలో కొంత మంది గర్ల్ ఫ్రెండ్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు... కపుల్ కి ఎంట్రీ అన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ లేకపోతే బాగా నిరాశ చెందుతున్నారు. లేదా తాము  కొనుక్కున్న డ్రస్ బాగుందో లేదో చెప్పడానికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అనుకునేవారు కూడా చాలామంది. అయితే ఇక నుంచి గర్ల్ ఫ్రెండ్ లేకపోతే పెద్దగా బాధ పడాల్సిన పని లేదు. 

 


 ఎందుకంటే ఇక్కడ ఒక షాపింగ్ మాల్ ఏకంగా గల్ ఫ్రెండ్స్ ని అద్దెకు ఇస్తోంది. వామ్మో  గర్ల్ ఫ్రెండ్స్ ని అద్దెకా... అయితే భారీగానే వసూలు చేస్తారు... అనుకుంటున్నారా అలా అనుకుంటే పొరపాటే. గర్ల్ ఫ్రెండ్స్ ని అద్దెకి  తీసుకోవడానికి కేవలం పది రూపాయలు మాత్రమే. చైనాలోని ఓ షాపింగ్ మాల్ యువకుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం పది రూపాయలకే గర్ల్ ఫ్రెండ్స్ ని అద్దెకు పంపిస్తుంది. హ్యూవాన్  సిటీలో ది విటాలిటీ  సిటీ షాపింగ్ మాల్... ఒంటరిగా వచ్చే యువకులకు గర్ల్ ఫ్రెండ్స్ ని అద్దెకు ఇచ్చేలా ఆఫర్ పెట్టింది. షాపింగ్ కోసం అమ్మాయి తోడుగా కావాలంటే అద్దెకు తీసుకోవచ్చు. 20 నిమిషాలకు 10 రూపాయలు చెల్లిస్తే చాలు. కస్టమర్ల సంఖ్య ను పెంచుకుని బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఈ షాపింగ్ మాల్ ఇలాంటి ఆఫర్ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: