తాజాగా తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో  కమలం పార్టీ సరైన విజయం సాధించలేక వాడిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా మున్సిపాలిటీల్లో పోటీ చేసేందుకు బీజేపీ పార్టీకి సరైన అభ్యర్థులే దొరకలేదు. ఇక చేసేదేమీ లేక 120 మున్సిపాలిటీలకు గాను 70 నుంచి 80 మున్సిపాలిటీలో మాత్రమే బిజెపి నుండి అభ్యర్థులు పోటీ చేశారు. అయితే పలు చోట్ల బిజెపి మెజారిటీ సీట్లు సాధించిన అప్పటికి పూర్తి స్థాయిలో మాత్రం బీజేపీ సత్తా చాటే లేకపోయిందని చెప్పాలి. అయితే మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి పార్టీ సత్తా చాటకపోవడానికి కారణం బిజెపి పార్టీలో ఏర్పడిన గ్రూపులే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

 


 ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్లు 60 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడున్న ప్రాంతాల్లో  ఎక్కువ మొత్తంలో బీజేపీ పార్టీ కి భారీ పట్టున్న  ప్రాంతాలే . అయితే ఈ రెండు డివిజన్లు ఇలా ఏకగ్రీవమయ్యాయి బీజేపీ అభ్యర్థులు ఎందుకు విత్ డ్రా చేసుకున్నారు అనే దానిపై అసలు నిజాలు తెలియాలి అంటూ బీజేపీ లోని ఓ వర్గం పట్టు పడుతుంది. అంతేకాకుండా కరీంనగర్ కార్పోరేషన్లు బిజెపి పార్టీ 13 డివిజన్లో మాత్రమే గెలిచింది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే... అసలు మచ్చుకైనా తెరమీద కనిపించడం లేదు కాంగ్రెస్ పార్టీ. అయితే కరీంనగర్ డివిజన్ లో బీజేపీ నుండి  ఓడిపోయిన వారిలో 200 లోపు   ఓట్ల తేడాతో ఓడిపోయిన వారే ఎక్కువ ఉన్నారు. దీంతో బిజెపి ఎక్కువగా ఓడిపోవడానికి కారణం సరైన అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలబడకపోవడమే అని టాక్ కూడా వినిపిస్తోంది. 

 

 ముఖ్యంగా ఎంపీ బండి సంజయ్ తమ వర్గానికి మాత్రమే టికెట్లు కేటాయించారని... బిజెపి సీనియర్ నేతలకు టికెట్లు కేటాయించలేదని దీంతో గెలిచే స్థానాల్లో కూడా బిజెపి పార్టీ ఓడిపోవాల్సిన  పరిస్థితి ఏర్పడింది అంటూ... పలువురు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నిజాంబాద్ లో ఎండల లక్ష్మీనారాయణ, ఎంపీ అరవింద్ మధ్య టికెట్ల చిచ్చు చివరివరకు నడిచిందని వార్తలు కూడా వచ్చాయి.. ఒకానొక సమయంలో టికెట్ల కేటాయింపు విషయంలో విసిగిపోయిన అరవింద్ ను డిఎస్ నచ్చజెప్పి టికెట్ల పంచాయతీని ఓ కొలిక్కి  తెచ్చారట. అంతేకాకుండా డిఎస్ జోక్యం తోనే 28 సీట్లను బిజెపి గెలవ కలిగింది అని బీజేపీ వర్గాలు చర్చించు కుంటున్నారు. ముఖ్యంగా గ్రూపుల గోలతో సరైన అభ్యర్థులకు మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు దక్కలేదనే పలువురు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా పాతతరం నేతల మధ్య కూడా ఫైట్ నడుస్తుందని ఇది పార్టీకి తీవ్రంగా నష్టం కలుగ జేస్తుంది అంటూ పార్టీ నాయకులు వాపోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: