ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎన్నో మంచి కార్యాలు జరుగుతున్నాయి.. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుంది సీఎం జగన్ ప్రభుత్వం. ఆ అభివృద్ధిని ఓర్చుకోలేక ప్రతిపక్షాలు చేసే చెత్త కార్యక్రమాలు మాములుగా లేవు. ప్రజలకు ఏ మంచి చేసిన దానిపై నెగటివ్ కామెంట్లు చేస్తారు.. నెగటివ్ ప్రచారం మొదలు పెడుతారు. 

 

అలానే ఇప్పుడు కూడా ఓ నెగటివ్ ప్రచారం మొదలు పెట్టారు.. అది ఏంటీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ లాంగ్ లీవ్‌పై వెళ్తున్నారు అని.. సీఎం జగన్ తీరు నచ్చక ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు.. రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతుంది. 

 

గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కొందరు టీడీపీ నెటిజన్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎంత జోరుగా అంటే.. సీఎస్ కే అవునా.. నేను నిజంగా జగన్ సర్కార్ తీరు నచ్చక లాంగ్ లీవ్ పెడుతున్నానా? అని అనుమానం వచ్చేలా.. సోషల్ మీడియాలో పచ్చ తమ్ముళ్లు ప్రచారం చేస్తున్నారు. 

 

అయితే సీఎస్ నీలం సాహ్నీ లాంగ్‌ లీవ్‌ తీసుకోవాలని భావిస్తున్నట్టు.. ఈ మేరకు ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నట్టు సమాచారం. అయితే పచ్చ తమ్ముళ్లు మాత్రం ఈ విషయాన్నీ కూడా క్యాష్ చేసుకొని.. రాజధాని తరలింపుపై జగన్ సర్కార్ దూకుడు అలాగే ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తే అధికారులను బాధ్యుల్ని చేస్తామని హైకోర్టు కీలక వ్యాఖ్యలు కారణంగానే ఆమె వెళ్తుంది అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 

 

కాగా ఈ పచ్చ తమ్ముళ్ల సోషల్ మీడియా ప్రచారంపై ఇంతవరుకు ఎవరు స్పందించలేదు... కాగా ప్రస్తుతం ఏపీ సీఎస్ గా ఉన్న నీలం సాహ్ని ఆంధ్రాకి రాకముందు కేంద్ర సర్వీసుల్లో కేంద్ర సామాజిక న్యాయ శాఖ సెక్రటరీగా విధులు నిర్వహించారు. గత సంవత్సరం నవంబర్‌లో ఏపీ సీఎస్‌గా నీలం సాహ్ని నియమితులు అయ్యారు. అయితే ఇంతలోనే సోషల్ మీడియాలో ఈ ప్రచారం జరగడం రాజకీయాలలో వేడి పుట్టించే అంశం అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: