ఈ రోజుల్లో నాన్‌వెజ్ ప్రియులు లేనివారు చాలా త‌క్కువ‌నే చెప్పాలి. ప్ర‌తి ఒక్క‌రూ నాన్‌వెజ్ ఎక్కువ‌గా తింటున్నారు. ఒక‌ప్పుడు లిమిటెడ్‌గా ఉండేవారు. ఇప్పుడు కూర‌గాయ‌లు తినేవాళ్ళు చాలా లిమిటెడ్ అయిపోయార‌ని చెప్పాలి. మా ఇంట్లో ఫంక్ష‌న్ అంటే... ఏంటి స్పెష‌ల్ చికెనా మ‌ట‌నా అని అడుగుతారు. పార్టీ అంటేనే చికెన్, మ‌ట‌న్ ఇలా నాన్ వెజ్‌తో కూడుకున్న వంట‌లు ఎక్కువ‌యిపోతున్నాయి. 

 

అందులోనూ బిర్యాని ప్రియుల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు అస‌లు బిర్యానీని ఇష్ట‌ప‌డ‌నివారు ఎవ‌రుంటారు ఎవ్వ‌రూ ఉండ‌రు. అయితేఈ బిర్యానీల్లో నాలుగైదు ర‌కాలున్నాయి. ఒక చికెన్‌బిర్యాని, మ‌ట‌న్‌బిర్యాని కామ‌న్ ఇంక ప్రాన్స్ ఇలా చాలానే వెరైటీలు వ‌చ్చేశాయి. మార్కెట్‌లో అయితే చికెన్‌,మ‌ట‌న్ అని చెప్పి బీఫ్ కలిపిన బిర్యానీలను అమ్మడం అందరికీ తెలుసు.  ఇది ఇప్పుడు కొత్తేమీ కాదు. అందుకే చాలా మంది బ‌య‌ట తిన‌డం పెద్ద‌గా ఆశ‌క్తిని చూప‌రు. అందులోనూ హైద‌రాబాద్‌లో అయితే ఇది మ‌రి కాస్త ఎక్కువ‌గానే క‌న‌ప‌డుతుంది. కానీ తమిళనాడులో హోటల్ నిర్వాహకులుమాత్రం అంతకుమించి  బీఫ్ కంటే చౌకగా ఏమి వస్తుందా అని ఆలోచించి కాకులను, పిల్లులను నమ్ముకున్నారు. చికెన్ బదులు కాకి మాంసాన్ని, మటన్ అని పిల్లి మాంసాన్ని బిర్యానీలో కలిపి అమ్మేస్తున్నారు.

 

ఇక పాపం పిచ్చిజ‌నం వాడు పెట్టిందే చికెన్ మ‌ట‌న్ అనుకుని తెగ లొట్ట‌లేసుకుంటూ తినేస్తున్నారు. అయితే ఈ విష‌యం బ‌య‌ట‌కు ఎలా వ‌చ్చిందంటే... ఫుడ్ ఇన్‌స్పెక్ష‌న్ జ‌ర‌గ‌డంతో అక్క‌డ చంప‌డానికి సిద్ధంగా ఉన్న పిల్లుల‌ను స్వాధీనం చేసుకున్నారు. 2016లోనే ఈ దందా వెలుగు చూడటంతో జనాలు అవాక్కయ్యారు. కానీ మ‌ళ్ళీ అంద‌రూ మ‌రిచిపోయారు.

 

అప్పట్లో రోడ్డు పక్కన ఉంటే హోటళ్లపై జరిపిన దాడులలో ఈ విషయాలు ఎక్కువ‌గా బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో అప్పటి నుంచి కాకి మాంసంపై నిషేధం విధించారు. తాజాగా రామేశ్వరంలో ఇలాంటి ఘటన  మ‌ళ్ళీ వెలుగు చూసింది. అక్కడి ఆలయానికి  చాలా కాకులు వ‌చ్చేవి అక్క‌డికి వచ్చిన కాకులు స్పృహ కోల్పోతున్నాయి. దీంతో భక్తుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు అధికారులు నిఘా పెట్టగా.. అవాక్క‌య్యే నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. 

ఆ కాకుల‌కు ఎవ‌రైతే గింజ‌లు వేస్తున్నారో ఆ వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. అధికారులు బెదిరించి ప్ర‌శ్నించ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టాడు. మద్యంలో ముంచిన బియ్యం గింజలను ఆ కాకులకు వేస్తున్నానని, దీంతో వాటిని తిన్నకాకులు స్పృహ కోల్పోతున్నాయని చెప్పాడు. అనంతరం వాటిని రోడ్డు పక్కన ఉన్న హోటళ్లకు విక్రయిస్తున్నట్టు వెల్లడించాడు. ఓ ప‌క్క చికెన్ మ‌ట‌న్ తింటేనే లేనిపోని రోగాలు అని జ‌నాలంద‌రూ భ‌య‌ప‌డుతుంటే మ‌ళ్ళీ కొత్తగా ఇవేంట‌ని బ‌య‌ట తినే ఫుడీలు భ‌య‌ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: