తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం కొనసముందర్ గ్రామ పంచాయతీ పరిధిలో పెండింగ్లో ఉన్న ఇంటి పనులు మరియు మొండి బకాయిలు వసూలు కోసం ఆ గ్రామానికి చెందిన సర్పంచ్ గ్రామస్తులకు బంపర్ ఆఫర్ ప్రకటిస్తూ టాక్స్ కడితే బైక్ ఫ్రీ అన్నట్టు లక్కీ డ్రా కు శ్రీకారం చుట్టారు. చాలా సంవత్సరాల నుండి ఈ పంచాయతీ పరిధిలో బకాయిలు పెరిగిపోవడంతో పాటు ఇంటి పనులు కట్టడానికి కూడా గ్రామస్తులు పెద్దగా శ్రద్ధ చూపించక పోవడంతో ఆ బకాయిలను సామరస్య వాతావరణంలో ఎలాగైనా వసూలు చేయాలని భావించిన గ్రామ సర్పంచ్ ఇంద్రలా రూప చాలా వెరైటీగా ఆలోచించడం జరిగింది.

 

ఇంటి పన్ను చెల్లించు లిఫ్ట్ పట్టు అనే పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గ్రామంలో 2019 మరియు 2020 ఏడాది మొత్తం బకాయి 18 లక్షలు మొండి బకాయిలు పేరుకుపోవడంతో సర్పంచ్ తీసుకున్న నిర్ణయానికి గ్రామంలో ప్రవేశపెట్టిన ప్రకటించిన పథకానికి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. గ్రామంలో ఉన్న చాలామంది ఎప్పటినుండో పేరుకుపోయిన ఇంటి పనులను బైక్ కోసం కట్టడానికి ముందుకు రావడం జరిగింది. లక్కీ డ్రా నేపథ్యంలో జనవరి నెల ఆఖరికి 18 లక్ష లో దాదాపు...14 లక్షల మొండి బకాయిలు వసూలు చేయడం జరిగింది.

 

కాగా గ్రామ సర్పంచ్ పంచాయతీ కార్యాలయంలో ఆవరణలో  ప్రజాప్రతినిధుల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో విజేతలను సర్పంచ్ ఎంపిక చేశారు. దీంతో మొదటి బహుమతి కింద హీరో బైక్‌ను గ్రామానికి చెందిన కల్ల గంగాధర్ దక్కించుకోగా, రెండో బహుమతి కింద ఎల్‌ఈడీ టీవీని బాలేరావు చిన్న నర్సు గెలుకుంది. మొండి బకాయిలు వసూలు చేసేందుకు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సర్పంచ్ రూపను అధికారులు, గ్రామస్తులు అభినందించారు. ప్రతి సంవత్సరం ఈ విధంగానే నిర్వహించాలని గ్రామస్తులు కోరారు. దీంతో ఈ స్కీం వర్కౌట్ అవడంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మిగతా గ్రామ సర్పంచులు కూడా ఈ స్కీం తమ గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: