మేడారం మ‌హాజాత‌ర నిర్వ‌హ‌ణ అధికార యంత్రానికి పెద్ద‌స‌వాలే. కోటిమందికిపైగా భ‌క్తులు త‌ర‌లివ‌చ్చే ఈ జాత‌ర‌ను ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా నిర్వ‌హించడం మామూలు విష‌యం కాదు. ప్ర‌ధానంగా ట్రాఫిక్ స‌మ‌స్య త‌లెత్త‌కుండా చూడ‌డం పెద్ద స‌వాలుగా ఉంటుంది. జాత‌ర తేదీల‌కు సుమారు నెల‌రోజుల ముందు నుంచే ఏర్పాట్లు మొద‌ల‌వుతాయి. ఇక జాత‌ర తేదీల నాటికి అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల యంత్రాంగం మేడారంలోనే మ‌కాం వేస్తుంది. ప్ర‌ధానంగా పోలీస్‌, ఆర్టీసీ, ఆరోగ్య‌.. ఇలా ప్ర‌తీ శాఖ ఉద్యోగులు విధుల్లో నిమ‌గ్న‌మ‌వుతారు.

 

మేడారం జాత‌ర నిర్వ‌హ‌ణ‌లో అత్యంత కీల‌కంగా పోలీస్ వ్య‌వ‌స్థ వ్య‌వ‌హ‌రిస్తుంది. కోటిమందికిపైగా త‌ర‌లివచ్చే జాత‌రలో ఎక్క‌డ కూడా చిన్న‌పాటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న చోటుచేసుకోకుండా క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాటు చేప‌ట్టింది. ట్రాఫిక్ ఇబ్బందులుత‌లెత్త‌కుండా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటోంది. జాత‌ర మార్గాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తోంది. అన్ని రూట్ల‌లో అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటోంది. డీజీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్ వ‌ర‌కు ప్ర‌తీ ఒక్క‌రు జాత‌ర నిర్వ‌హ‌ణ‌లో నిమ‌గ్న‌మై ఉన్నారు.

 

ఇదిలా ఉంటే ఈ జాత‌ర‌కు చాలా మంది ఫ్యామిలీస్ ఎక్కువ‌గా అటెండ్ అవుతారు. పిల్ల‌లు, పెద్ద‌లు అంద‌రూ వ‌చ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఎవ్వ‌రికి ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా అన్ని వ‌స‌తులు క‌లిపించేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. అలాగే ఏ ప్ర‌దేశ‌మైతే ఎక్క‌వ‌గా భ‌క్తుల‌తో ర‌ద్దీగా మారుతుందో అక్క‌డ కాస్త బందోబ‌స్త్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇక అధికారులు అక్క‌డ చేసే ఏర్పాట్ల‌కు ఈ సారి భ‌క్తుల‌కు మైండ్ బ్లోయింగ్ అనిపించాల్సిందే. అలాగే ప్ర‌తి ఏటి ఎంతో న‌మ్మ‌కంతో ఈ జాత‌ర‌ని చేస్తారు.  పర్యాటకులు, భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ బేగం పేట విమానాశ్రయం నుండి మేడారంకు హెలికాప్టర్ సర్వీసులు కూడా పెట్టారు.  ఆసియాలోనే అతి పెద్ద గిరిజన పండుగ మేడారం ‘సమ్మక్క-సారలమ్మ’ జాతరకు ఇప్పటికే అంకురార్పణ పడింది. మేడారం గద్దెల వద్ద భక్తులు ఇప్పటికే కిక్కిరిసిపోయారు. ఫిబ్రవరి 5న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి చేరడంతో మహా జాతర మొదలవుతుంది. ఫిబ్రవరి 5, 6, 7, 8 తేదీల్లో ప్రధాన జాతర జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: