నిజాయితీగల అధికారిగా పేరుపొందడమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా జగన్ అక్రమాస్తుల కేసులో విచారణాధికారిగా నియమితులైన ఆయన అతి కొద్ది సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయన మనసంతా రాజకీయాలవైపు మళ్లడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి దిగిపోయారు. వ్యవసాయమంటే నాకు మక్కువ ఎక్కువ అంటూ చెప్పుకుని కొంతకాలం ఆయన రాష్ట్రమంతా పర్యటించి రాజకీయంగా పలుకుబడి పెంచుకునేందుకు ప్రయత్నించారు. ఆ తరువాత పరిణామాల్లో జనసేనలో చేరి ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు.


 ఇక అప్పటి నుంచి ఆయన జనసేనకు దూరంగా ఉండడంతో ఆయన బీజేపీలోకి వెళ్తారని అంతా భావించగా ఆయన మాత్రం సొంత పార్టీ పెట్టబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయినా ఆయన బీజేపీ మీద తనకు ఉన్న ప్రేమను బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీకి సరైన ప్రాధాన్యం దక్కకపోవడంతో బీజేపీ తీరును అందరూ విమర్శిస్తూ ఉండగా ...లక్ష్మీ నారాయణ మంత్రం బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందంటూ బీజేపీని పొగుడుతున్నారు. 


బిజెపి ఆధ్వర్యంలో దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది అంటూ ఆయన బహిరంగ సభలోనే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, ప్రాజెక్టులకు, పథకాలకు నిధులు, వెనకబడిన జిల్లాలకు పద్దుల్లో నిధుల ప్రస్తావన గురించి కేంద్ర బడ్జెట్ లో చోటు దక్కకపోయినా వాటి గురించి పట్టించుకోకుండా... బడ్జెట్ బ్రహ్మాండంగా ఉంది అంటూ లక్ష్మీనారాయణ చెబుతుండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా ఆయనపై విమర్శలు చెలరేగడానికి  కారణం అవుతోంది.


  లక్ష్మీనారాయణ సొంతంగా పార్టీ పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతున్నా అందులో వాస్తవం లేదని, ఆయన త్వరలోనే బిజెపిలో చేరి రాజ్యసభ సభ్యుడిగా నామినేటెడ్ అయ్యి ఆ తరువాత కేంద్రంలో మంత్రి పదవి దక్కించుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని ఎక్కడా హైలెట్ కాకుండా చూసుకుంటూ లక్ష్మి నారాయణ జాగ్రత్తపడుతున్నట్టుగా కనిపిస్తోంది. సమర్థుడైన అధికారిగా పేరుతెచ్చుకున్న ఆయన ఇప్పడు సగటు రాజకీయ నాయకుడిగా మారిపోవడం మేధావులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: