మేడారం జాతర ఉత్సవాలు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేయగా సమ్మక్క సారక్కలను దర్శించుకోవటం కొరకు భక్తులు ఇప్పటికే భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఇతర రాష్ట్రాల నుండి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఈ జాతరకు హాజరవుతూ ఉండటం గమనార్హం. రానున్న పది రోజులలో కోటి మందికి పైగా భక్తులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది.                                      
 
ప్రతాపరుద్రుడు ఓరుగల్లును పాలించే కాలంలో తీవ్రమైన కరువు ఏర్పడటంతో మేడారంను పరిపాలిస్తున్న పడిగిద్దరాజును కప్పం కట్టమని ఆదేశిస్తాడు. పగిడిద్దరాజు కప్పం కట్టటానికి నిరాకరించటంతో పగిడిద్దరాజుపై ప్రతాపరుద్రుడు యుద్ధం ప్రకటిస్తాడు. పడిగిద్దరాజు కుమార్తె సమ్మక్క. వీరికి సారలమ్మ, నాగులమ్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాకతీయ సైన్యంపై వీరు తిరుగుబాటు చేసి వీరమరణం పొందుతారు. 
 
అలా మరణం పొందిన వారిని గిరిజన దేవతలుగా పూజిస్తూ మేడారం జాతర జరుపుకుంటున్నాము. ఆధిపత్యంపై ఆదివాసీలెగరేసిన తిరుగుబాటు కథే మేడారం జాతర. తెలంగాణ రాష్ట్ర పల్లెలన్నీ మేడారం జాతర వైపు కదులుతున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీన మొదలయ్యే ఈ జాతర ఫిబ్రవరి నెల 7వ తేదీన ముగియనుంది. 7వ తేదీ ఇక్కడ అసలైన జాతర మొదలవుతుంది. 
 
తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మేడారం జాతరకు బేగంపేట్ నుండి హెలికాఫ్టర్ సేవలను ప్రారంభించింది. బేగంపేట్ నుండి మేడారం వరకు ఆరుగురు ప్రయాణించాలంటే 1,80,000 రూపాయలతో పాటు జీఎస్టీని అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ సదుపాయాన్ని భక్తులు సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మేడారం జాతరకు భక్తులు ఇప్పటికే పోటెత్తుతున్నారు. భక్తులు గద్దెలపై ఉన్న అమ్మవార్లను జంపన్న వాగులో స్నానమాచరించి దర్శించుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: