కాపులు మాత్రం జగన్మోహన్ రెడ్డి విషయంలో పిచ్చ హ్యాపీగా ఉన్నారట.  ఎవరు అవునన్నా కాదన్నా ప్రస్తుతం ఏపి గతంలో ఎన్నడూ లేని విధంగా సామాజికవర్గాల వారీగా చీలిపోయింది.  మొత్తం సామాజికవర్గాల్లో ప్రధానమైన రెడ్డి-కమ్మ సామాజికర్గాల్లో రాజకీయ వైరం పీక్స్ కు చేరుకుంది. ఈ నేపధ్యంలో జరిగిన ఎన్నికల్లో జగన్ బంపర్ మెజారిటితో అధికారంలోకి వచ్చారు. అప్పటి నుండి కమ్మ సామాజికవర్గంలో టెన్షన్ మొదలైంది.

 

ఇంతకీ జగన్ విషయంలో కాపు సామాజికవర్గం ఎందుకు హ్యాపీగా ఉంది ? ఎందుకంటే దశాబ్దాల తరబడి కమ్మ సామాజికిర్గం ఆధిపత్యాన్ని కాపులు ప్రశ్నించలేకున్నారు.  అలాంటిది మొన్నటి ఎన్నికల్లో బంపర్ మెజారిటితో గెలిచారు. అప్పటి నుండి కమ్మ సామాజికవర్గం ఆర్ధిక మూలాలను దెబ్బ కొట్టడం మొదలుపెట్టారు. దాంతో తాము చేయలేకపోయిన పనిని జగన్ చేస్తున్నందుకు పిచ్చ హ్యాపీగా ఉన్నారు.

 

చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు రాజకీయంగా, పారిశ్రామికంగా, ఆర్ధికంగా చాలామంది కమ్మ ప్రముఖులు విపరీతంగా బలోపేతమైపోయారు. మొన్నటి ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రాగానే  మరింతగా ఎదగటానికి ప్రణాళికలు వేసుకున్నారు. అయితే  జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి  వాళ్ళ ఆర్ధిక ఎదుగుదల ఆగిపోయింది. పైగా చాలామంది కమ్మ ప్రముఖుల ఆర్ధిక మూలాలపై దెబ్బ పడింది.

 

మొదటిది ప్రభుత్వ  స్కూళ్ళలో ఇంగ్లీషుమీడియంను ప్రవేశపెట్టటం. చాలా ప్రైవేటు స్కూళ్ళు ఉంటే కమ్మవారి చేతుల్లోనో లేకపోతే టిడిపి మద్దతుదారుల చేతుల్లోనో ఉందన్నది వాస్తవం. ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీషుమీడియంను ప్రవేశపెడుతుండటంతో ప్రైవేటు స్కూళ్ళ నుండి విద్యార్ధులు ప్రభుత్వ స్కూళ్ళలో చేరిపోతున్నారు. తర్వాత రాజధాని తరలింపు వ్యవహారం.

 

రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నంకు తరలిపోతుండటంతో  మళ్ళీ కమ్మ ప్రముఖులపై ఆర్ధికంగా వేల కోట్ల రూపాయల మేర దెబ్బే పడింది. అలాగే ఇసుక మాఫియా, లిక్కర్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫీల్డ్, ప్రభుత్వంలోని కీలక స్ధానాల నుండి  పక్కనపెట్టేయటం లాంటి చర్యల వల్ల కమ్మ సామాజికవర్గం భారీగా నష్టపోతోంది. దాంతో కమ్మ సామాజికవర్గాన్ని లేవకుండా జగన్ దెబ్బ మీద దెబ్బ కొడుతుండటంతో కాపులు మాత్రం పిచ్చహ్యాపీగా ఉన్నారని సమాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: