ప్రస్తుత పరిస్దితులో దేశంలో ఎక్కడ చూడు దారుణ సంఘటనలు నిత్యం ప్రత్యక్షం అవుతున్నాయి. ఇవి ఎలాంటి వంటే ఎక్కువగా, లైంగిక వేధింపులు, అక్రమ సంబంధాలు, అత్యాచారం చేసి హత్య చేసే ఘటనలు. ఇవి తప్పా వేరే వార్తలు తక్కువగా వినిపిస్తున్నాయి. దేశంలో ఏ మూల చూసిన ఎక్కడో ఒకచోట పదుల సంఖ్యలో ఇలాంటి దారుణ సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. అంతే కాకుండా,  లైంగిక నేరాలను అదుపులో పెట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు, ఎన్ని చర్యలు చేపట్టినా.. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా లైంగిక నేరాలే ఉండటం భయాందోళన కలిగిస్తోంది.

 

 

అసలు ఇలాంటి నేరాలకు పాల్పడే నిందితుల్లో ఏ మాత్రం భయం, బాధ కనిపించడం లేదు... ఇక కేసుల్లో ఉరిశిక్ష పడిన దోషులు ఉన్న రాష్ట్రాల జాబితాలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 54 ఉరిశిక్ష పడిన కేసులున్నాయి. మిగతా రాష్ట్రాల వారిగా చూస్తే.. మహారాష్ట్ర 45, మధ్యప్రదేశ్‌ 34 ఉన్నాయి. గత ఏడాదిలో లైంగిక నేరాలతో సంబంధం ఉన్న 56 హత్య కేసుల్లో కేవలం 15 కేసుల్లో హైకోర్టులు మరణశిక్షను విధించాయి. అలాగే సుప్రీం కోర్టు సైతం మొత్తం 17 కేసుల్లో కేవలం 11 కేసుల్లో ఉరిశిక్ష ఖరారు చేసింది. ఇక లైంగిక నేరాలతో సంబంధం ఉన్న ఏడు కేసుల్లో నాలుగు ఉరిశిక్ష పడ్ద కేసులను సమర్ధించింది.

 

 

2012 నాటి పోస్కో చట్టంలో సవరణలు జరగడంతో లైంగిక నేరాల కేసులో ఎక్కువగా ఉరిశిక్షలు అమలు చేశాయి న్యాయస్థానాలు. ఈ చట్టం వచ్చిన తర్వాత ఉరిశిక్షలు అధికంగా అమలు చేస్తున్నా.. నేరాలు మాత్రం ఆగడం లేదు. ఇక గత ఏడాది డిసెంబర్‌ 31 నాటికి దేశ వ్యాప్తంగా ఉరిశిక్ష పడిన దోషులు 378 మంది వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే కాకుండా నిర్భయ కేసులో ఉరిశిక్ష పడ్ద ఖైదీలకు ఇప్పటివరకు ఆ శిక్షను అమలు చేయలేకపోతున్నారు. తెలివిమీరిన ఇలాంటి మృగాళ్లూ న్యాయవ్యవస్థలో కొన్ని నిబంధనలను అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలని చూస్తున్నారు.

 

 

ఇకపోతే దేశ వ్యాప్తంగా 102 కేసుల్లో న్యాయస్థానం దోషులకు ఉరిశిక్ష విధించగా, మొత్తం 13 కేసుల్లో రాజస్థాన్‌ అగ్రస్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్‌ 12వ స్థానం, మధ్యప్రదేశ్‌లో 11, కర్ణాటక 10, పశ్చిమబెంగల్‌ 8, జార్ఖండ్‌ 8, బీహార్‌ 7, ఒడిశా 7, కేరళ 5, అస్సాం 4, పంజాబ్‌ 3, గుజరాత్‌ 2, తెలంగాణ 2, చత్తీస్‌గఢ్‌ 2, మణిపూర్‌ 1, త్రిపుర 1 స్థానంలో ఉన్నాయి.. ఈ లెక్కలు క్రమక్రమంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయో తప్పా తగ్గే అవకాశాలు మాత్రం ఏ కోశాన కనిపించడం లేదు.. ఇలాగైతే ముందు ముందు ఆడపిల్లలు బ్రతకడం కష్టం అవుతుందంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: