రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరి ఏ ఫ్యామిలీ లేదన్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ మొత్తానికి ఫ్యాన్స్ ఉండటమే కాకుండా...ఒక్కో హీరోకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో సినిమా వచ్చిన, అందరూ దాన్ని కలిసికట్టుగా ఆదరిస్తారు. అయితే ఇలా కలిసికట్టుగా ఉండే మెగా ఫ్యాన్స్‌లో చీలిక వచ్చిందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. పవన్ ఫ్యాన్స్ సెపరేట్ అయిపోయి...మిగతా మెగా ఫ్యాన్స్ సెపరేట్‌గా ఉన్నారని ప్రచారం పెద్ద ఎత్తున వచ్చింది.

 

ఇక ఆ చీలిక వల్ల 2019 ఎన్నికల్లో జగన్‌కు బాగా కలిసొచ్చిందనే చెప్పొచ్చు. ఇక ఈ మధ్య కూడా సైరా సినిమా నుంచి కాస్త పరిస్తితులు మారిపోయాయని రాజకీయ విశ్లేషుకులు అంటున్నారు. సైరా సినిమా రిలీజ్ సమయంలో జగన్ ప్రభుత్వం ట్యాక్స్ తీసేయడం, చిరంజీవి, జగన్ ఇంటికి వెళ్ళి కలవడం లాంటి పరిణామాలతో పవన్ ఫ్యాన్స్‌లో ఆగ్రహాలు మొదలయ్యాయి. అదే సమయంలో మెగా ఫ్యాన్స్ జగన్‌కు సపోర్ట్ ఇవ్వడం మొదలు పెట్టారు. పైగా ఈ మధ్య మూడు రాజధానులకు చిరంజీవి మద్ధతు పలికారని వార్తలు కూడా రావడం జగన్‌కు ప్లస్ అయింది.

 

ఇక అల వైకుంఠపురములో సినిమా విడుదల నేపథ్యంలో అల్లు అర్జున్ పవన్‌ని పెద్దగా లెక్క చేయని విధంగా, నేను చచ్చేవరకు చిరంజీవి గారి అభిమానినే అని చెప్పడం వల్ల, పరిస్తితులు మరింత మారాయి. మామూలుగానే అల్లు అర్జున్ పట్ల పవన్ ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగానే ఉంటారు. ఇక మొన్నటిదెబ్బకు మరింత ఎక్కువైంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పవన్‌కు యాంటీగా వచ్చారు. పైగా చిరంజీవి సపోర్ట్ కావడంతో వీరు కూడా జగన్‌కే మద్ధతు ఇస్తున్నారని తెలిసింది. అసలు ఎన్నికల్లోనే సీనియర్ మెగా ఫ్యాన్స్ జగన్‌కే ఓటు వేశారు. ఇక ఇప్పుడు చాలావరకు మెగా ఫ్యాన్స్ జగన్‌ వైపు వచ్చారని టాక్ నడుస్తుంది. అటు పవన్ అంటే అభిమానం ఉన్నవారు జనసేనకి అండగా ఉంటున్నారు. మొత్తానికి చూసుకుంటే మెగా ఫ్యాన్స్‌లో జగన్‌కు ఫాలోయింగ్ పెరిగిందనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: