రోజురోజుకూ రాష్ట్రంలో టీడీపీ పరిస్తితి దిగజారిపోతుంది. ఎన్నికల తర్వాత నుంచి టీడీపీకి అసలు ఏది కలిసి రావడం లేదు. ఫలితాలే దారుణంగా వచ్చాయి అనుకుంటే...ఆ ఫలితాల తర్వాత నేతలు వరుస షాకులు ఇచ్చి పార్టీని కోలుకోకుండా చేసేశారు. పైగా జగన్ ప్రవేశ పెట్టె పథకాల దెబ్బకు టీడీపీకి కష్టాలు పెరిగాయంటే...మూడు రాజధానుల నిర్ణయంతో టీడీపీ కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైపోయే పరిస్తితికి వచ్చింది. అయితే ఇది నిర్ణయం చంద్రబాబు సొంత జిల్లాలో కూడా బాగా ప్రభావం చూపుతుంది. ఈ జిల్లా వాసులు మూడు రాజధానులకే ఎక్కువ మద్ధతిస్తున్నారని, తాజాగా వైసీపీ నేతలు ..బాబు సొంత వూరు నారావారిపల్లిలో పెట్టిన సభ రుజువు చేసింది.

 

అసలు మామూలుగానే చిత్తూరు జిల్లాలో టీడీపీ చాలా వీక్ గా ఉంటుంది. వైఎస్సార్ ఉన్నప్పుడూ చిత్తూరు ఆయనకు మెజారిటీ సీట్లు ఇచ్చేది. ఇక జగన్ వచ్చాక మెజారిటీ సీట్లు వైసీపీకి వస్తున్నాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన మెజారిటీ సీట్లు వైసీపీనే గెలిచింది. మొత్తం 14 సీట్లలో 8 వైసీపీ గెలిస్తే, టీడీపీ 6 గెలిచింది. ఇక 2 ఎంపీ స్థానాల్లో ఒకటి వైసీపీ, ఒకటి టీడీపీ గెలిచింది. 2019 ఎన్నికలోచ్చేసరికి పరిస్తితి మరింత మారిపోయింది. మొత్తం 14 సీట్లలో వైసీపీ 13 గెలిస్తే, ఒక్క కుప్పంలో చంద్రబాబు గెలిచారు. 2 ఎంపీ సీట్లు వైసీపీనే ఎగరవేసుకుపోయింది.

 

అయితే రానున్న రోజుల్లో పరిస్తితి ఇలాగే కొనసాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రాయలసీమలో కర్నూలు జ్యూడిషయల్ క్యాపిటల్ కానుండటంతో, చిత్తూరు ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఇక్కడి ప్రజలు జగన్‌కు మరింత పాజిటివ్ గా మారారు. కాబట్టి ఏ ఎన్నికలు జరిగిన చిత్తూరు జిల్లాలో వైసీపీ హవానే కొనసాగనుంది. మొత్తానికైతే బాబు సొంత జిల్లాలో సైకిల్ పంక్చర్ అయ్యి...జగన్ సొంతమైపోయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: