గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకోక ముందు అమరావతి ప్రాంతంలో పర్యటించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరొకసారి పర్యటించడానికి రాజధాని గ్రామాల్లో కొన్న రైతులను పరామర్శించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత భారీ ఎత్తున కవాతు చేసి అమరావతి కి అండగా నిలబడాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ వేయడం జరిగింది.

 

అయితే బిజెపి పార్టీ నుండి అధిష్టానం నుండి పర్మిషన్ రాకపోవడంతో పవన్ కళ్యాణ్ తన ప్రయత్నాలు ఆపేశారు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ సినిమాల పరంగా బిజీ అవుతున్నారు. ఇటువంటి తరుణంలో ఇటీవల మంగళగిరి పార్టీ ఆఫీసులో అమరావతి ప్రాంతంలో దీక్షలు నిరసనలు చేస్తున్న రైతులకు పోలీసుల నుండి బెదిరింపులు మరియు దాడులు వస్తున్నాయని పవన్ దృష్టికి రాజధాని  రైతులు తీసుకెళ్లడంతో... పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాల్లో రెండు రోజులు పర్యటించడానికి కార్యచరణ సిద్ధం చేయాలని ఏ ఏ గ్రామాలు సందర్శించాలో నిర్ణయించవలసిందిగా స్థానిక నాయకులను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. అయితే పర్యటన తేదీలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

 

ఇటీవల అసెంబ్లీ ముట్టడి సందర్భంగా గాయపడిన వారు పవన్ కళ్యాణ్ ను మంగళగిరి పార్టీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రాజధాని గ్రామాల్లో మరోసారి పర్యటించాలని వారు కోరారు. పర్యటన ఎక్కడెక్కడ జరగాలి, ఏ విధంగా జరగాలి అనే కార్యాచరణను పార్టీ నాయకులు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇదే తరుణంలో బిజెపి పార్టీ నేతలు కూడా జనసేన పార్టీ నాయకులతో కలసి రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తారో లేదోనన్న క్లారిటీ అమరావతి ప్రాంత రైతులకు రాలేదు. మరోపక్క అమరావతి రైతులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వారి డిమాండ్లను నెరవేర్చడానికి తెలుసుకోవడానికి కమిటీలను నియమించే పనిలో ఉంది. మొత్తం మీద బిజెపి పార్టీతో చేతులు కలిపాక పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాల్లో పర్యటన చేపట్టడంతో ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం అయ్యింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: