త్వరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాల్లో ఎవరికి అవకాశం దక్కబోతోంది అనే టెన్షన్ ఏపీ అధికార పార్టీలో నెలకొంది. ఇప్పటికే ఆశావాహులు చాలామంది రాజ్యసభ సభ్యత్వం దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. దీనికోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఇప్పటికే జగన్ తగిన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మొదటి నుంచి తమ కుటుంబం పై అభిమానంతో ఉండడమే కాకుండా ఎన్నో త్యాగాలకు పాల్పడిన ఇద్దరు మంత్రులకు రాజ్యసభ స్థానాలు కల్పించాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చారట. అయితే వారు ప్రస్తుతం ఎంఎల్సీ కోటాలో మంత్రులుగా ఉన్నారు. త్వరలో శాసనమండలి రద్దు కాబోతున్న నేపథ్యంలో వీరు మంత్రి పదవులు కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడబోతోంది. 


మొదటి నుంచి తనను నమ్ముకున్నవారికి న్యాయం చేసేందుకు వెనకాడని జగన్ ఇప్పుడు మంత్రి పదవులు కోల్పోయే అవకాశం ఉన్న subhash chandra BOSE' target='_blank' title='పిల్లి సుభాష్ చంద్రబోస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. వీరిద్దరూ తనకు అత్యంత ఆప్తులే కాకుండా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వీరికి రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టడం ద్వారా సామజిక కోణంలోనూ లెక్కలు సరిపోతాయని జగన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై అన్ని కోణాల్లోనూ జగన్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.


త్వరలో ఖాళీ కాబోతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఈ ఇద్దరికీ రెండు కేటాయించి మిగిలిన రెండిటిని వేరేవారికి కట్టబెట్టాలని జగన్ ప్లాన్ వేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి విషయంలోనూ వైసీపీలో చాలా సానుభూతి ఉంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా చాలా ఇబ్బందులని ఎదుర్కొన్నారు. మోపిదేవి వెంకట రమణ జగన్ అక్రమాస్తుల కేసులోనూ జైలుకి వెళ్లివచ్చారు. ఇక సుభాష్ చంద్ర బోస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు జగన్ పార్టీ పెట్టగానే మంత్రి పదవికి రాజీనామా చేసి మరీ వైసీపీలో చేరారు. ఇవన్నీ మనసులో పెట్టుకునే జగన్ ఇప్పుడు ఈ ఇద్దరికీ న్యాయం చేసే విధంగా రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టేందుకు సిద్ధం అవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: