ఏపీలో వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తున్న విషయం తెలిసిందే. పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అవినీతి రహిత పాలనను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. పేద ప్రజలకు చేయూతనిచ్చేలా  ఇప్పటికే ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్యపాన దిశగా జగన్మోహన్ రెడ్డి  సర్కార్ అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని మద్యం షాపులు అన్నింటినీ మూసివేసి  ప్రభుత్వమే మద్యం షాపులను స్వయంగా నిర్వహిస్తోంది. అంతేకాకుండా మద్యం పని వేళలు కూడా తగ్గించింది జగన్ సర్కార్. 

 

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద ప్రజలు ఎవరూ మద్యం బారినపడి జీవితాలను నాశనం చేసుకోవద్దు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి  సర్కార్ సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే మద్యం ధరలను  కూడా భారీగా పెంచి సామాన్య ప్రజలకు మద్యం  అందుబాటులో ఉండకుండా చేస్తుంది. దీంతో చాలా మటుకు మద్యం అమ్మకాలు కొనుగోల్లు  తగ్గాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అయితే జగన్మోహన్రెడ్డి సర్కార్ తీసుకువచ్చిన మద్యపాన నిషేధం పై కూడా టిడిపి విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో మద్యపాన నిషేధం జగన్ సర్కార్ అమలు చేస్తే సారా  వాడకం పెరిగిందని టిడిపి ఆరోపిస్తోంది. 


 అయితే మద్యపానం నిషేధం దిశగా అడుగులు వేస్తున్న జగన్ సర్కారు ఇప్పటికే పలుచోట్ల అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారిని అరెస్ట్ చేసి కేసులు పెట్టిన విషయం తెలిసిందే. మద్యపాన నిషేధం నిర్ణయానికి ఎవరు తూట్లు పొడుస్తున్నట్లు తెలిసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నది  జగన్ సర్కార్. అంతేకాకుండా మద్యం సహా  నాటుసారా అక్రమ  రవాణాపై ఫిర్యాదు చేసేందుకు 14500 నెంబర్కు కాల్ చేయాలని జగన్ సర్కార్ సూచించింది. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం లో భాగంగా లిక్కర్ వినియోగం 26 శాతం బీరు వినియోగ 50 శాతం తగ్గింది అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా 17 శాతం తగ్గినట్లు ఓ  సర్వే వెల్లడించింది.అయితే  రాబోయే ఐదు సంవత్సరాల జగన్ పాలనలో నిషేధం పై ఆంక్షలు ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం జగన్ సర్కార్ మద్యపాన నిషేధం పై కఠిన నిబంధనలు అమలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: