ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే . ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంపెనీలు పెట్టుబడులు వెనక్కి పంపుతున్నారు అనే విషయంలో అయితే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక తాజాగా మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించిన టిడిపి అధినేత ప్రతిపక్షనేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జగన్ సర్కార్ పై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టిడిపి పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర నుంచి కంపెనీలను వెనక్కి తరలిస్తున్నారు అంటూ మండిపడ్డారు. 

 

 

 విశాఖలో అదాని డేటా సెంటర్ ఏర్పాటు అయి ఉంటే... లక్ష మంది నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన జరిగేదని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కానీ ప్రస్తుతం వైసీపీ సర్కార్ తీరు వల్ల  ఆ కంపెనీని కూడా వెనక్కి వెళ్లే పరిస్థితి తీసుకు వచ్చింది అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లులూ  కంపెనీ వచ్చుంటే... వేలాది మందికి ఉపాధి దొరికేదని...  కానీ ప్రస్తుతం ఆ కంపెనీ పరిస్థితి కూడా ఇంతే అంటూ వ్యాఖ్యానించారు. నీతి నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనం లాంటి సింగపూర్ ప్రభుత్వ సంస్థలను... జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రైవేటు కంపెనీలు అంటూ ముద్ర వేశారు అంటూ విమర్శించారు చంద్రబాబు నాయుడు. 

 

 

 ఇక అటు కియా కంపెనీ  సంగతి కూడా ఇదేనని.. దీనికంటే ఏమీ భిన్నంగా లేదు అంటూ వ్యాఖ్యానించారు. కియా కు చెందిన 17 అనుబంధ సంస్థలు జగన్ సర్కారు తీరు వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్లి పోయాయి అంటూ ఆరోపించారు.మీ  కక్కుర్తి అంతా కమీషన్ల కోసమే... ఓ రోజు చూశాను... వైసీపీ ఎంపీ కియా సంస్థ ప్రతినిధి ని దాదాపు కొట్టినంత పని చేసాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు . ప్రస్తుతం జగన్ సర్కారు తీరు వల్ల జియో కంపెనీ సంస్థ ప్రతినిధులకు  కూడా సెక్యూరిటీ కి ప్రమాదం ఏర్పడే  పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది అంటూ విమర్శించారు. అక్కడ పెట్టుబడి పెట్టారు కాబట్టి వాళ్ళు కొనసాగుతున్నారు... ఆరోజు మహారాష్ట్ర పోటీకి వచ్చిన కియా మోటార్స్  పట్టుబట్టి మరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చాం... ఆరు నెలలోనే గొల్లపల్లి నుంచి కియా కు నీళ్లు ఇచ్చాము... అక్కడి వాళ్లు బాగు పడే సరికి మల్ల వీళ్ళకి కన్నుపడింది... మొత్తం నాశనం అయిపోయింది.. మీ వల్ల 79 వేల కోట్ల రూపాయలు వెనక్కి పోయాయి అంటూ మండిపడ్డారు టీడీపీ అధినేత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: