అవును.. ఈ మంచి వార్తను చంద్రబాబె చెప్పాడు. నిజంగా.. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత అయినా చంద్రబాబుకు ఉన్న కోరికలు హిట్లర్ కి కూడా ఉండవు అని అంటున్నారు నెటిజన్లు.. అవును అండి..  చంద్రబాబుకు 70 ఏళ్ళు వచ్చాయి.. 15 ఏళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించాడు.. కానీ ఇంకా ముఖ్యమంత్రి కుర్చీపై మోజు పోలేదు అంటే నమ్మరు. 

 

అవును చంద్రబాబు నాయుడుకు ఉన్న కోరికలు పాతికేళ్ల కుర్రాడికి కూడా ఉండవు.. ఎంత కోరిక లేకపోతే.. 70 ఏళ్ళు దాటినా ఇంకా 15 ఏళ్ళు జీవిస్తా అంటడు. సరే.. చంద్రబాబు నాయుడు ఇంకా 15 ఏళ్ళు జీవిస్తే.. ఆంధ్ర ప్రజలు ఎంతమంది ఆనందిస్తారు? పచ్చ పార్టీ వాళ్లంతా.. సారీ సారీ.. అక్కడ కూడా కొందరు వద్దు అనుకునే వాళ్ళు ఉంటారు.

 

సరే ఈ విషయం పక్కన పెడితే.. చంద్రబాబు నాయుడు తన ఆరోగ్యంపై తాజాగా ఓ మాట చెప్పారు.. అది ఏం అని అంటే.. తన ఆరోగ్యం అంత బాగుంటే మరో 15 సంవత్సరాలు జీవిస్తారని.. అయితే తనకు తన ఆరోగ్యంపై ఎటువంటి భాద లేదని.. కేవలం ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు గురించే చింత ఉందని చెప్పుకొచ్చారు. 

 

నిన్న సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఆరోగ్యం గురించి.. రాష్ట్ర భవిష్యత్తు గురించి చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు విన్న నెటిజన్లు.. అయ్యో.. చంద్రబాబు.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కానీ నువ్వు ఎక్కువ ఆలోచించకు అని ఒకరు అంటే మరొకరు స్పందిస్తూ.. రాష్ట్రం బాగుంటే సినిమాలు చేస్తా అని అన్న దత్తపుత్రుడు ఇప్పటికే 5, 6 సినిమాలకు సంతకాలు చేశాడు.. ఇప్పుడు మీరు అదే అంటున్నారు బాబోరు.. ఆరోగ్యం జాగ్రత్త అంటూ బాబు ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు ప్రజలు. అవును.. చంద్రబాబు మరో 15 ఏళ్లు జీవించడం మీకు గుడ్ న్యూసేనా? 

మరింత సమాచారం తెలుసుకోండి: