ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. హైకోర్టు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడంతో ఏపీలో ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 17వ తేదీన విడుదల కాబోతుందని సమాచారం. ఫిబ్రవరి 17వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా మార్చి నెల 15వ తేదీలోగా ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది.                  
 
ప్రభుత్వం ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల కొరకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. రిజర్వేషన్లను ఖరారు చేసే పనులు వేగంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు హైకోర్టు వైసీపీ పార్టీ రంగులు గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. హైకోర్టు వారం రోజుల క్రితమే పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగులు రెండు వారాల్లో తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. 
 
హైకోర్టు ఆదేశాలతో తాజాగా పాత రంగులను చెరిపివేసి కొత్త రంగులను వేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు కూడా పార్టీ రంగులు వేయడంతో సచివాలయాలకు కూడా పాత రంగులకు చెరిపివేసి కొత్త రంగుల వేయించే దిశగా పనులు జరుగుతున్నాయి. హైకోర్టు పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానికి సంబంధించినవి అని ఒక పార్టీ రంగులు వాటికి వేయడం మంచిది కాదని పేర్కొంది. 
 
పార్టీలకు సంబంధించిన గుర్తుల మీదనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఏ పార్టీ ఎన్నికలలో ఎన్ని స్థానాలను గెలుచుకుంటుందో చూడాల్సి ఉంది. సాధారణంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు ఎక్కువగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లొనే ప్రజా సంక్షేమ పాలన దిశగా నిర్ణయాలు తీసుకోవడంతో వైసీపీ పార్టీనే మెజారిటీ స్థానాలలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: