ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన నైజం... ఎవరేమనుకున్నా డోంట్ కేర్... అందరిదీ ఒక రూట్  అయితే ఆయనది  మాత్రం యమ సపరేటు రూటు... సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్  ఆయన... ఆయన ఇంకెవరో కాదు... సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. తాజాగా రామ్ గోపాల్ వర్మ...  జీవ రియా సుమన్ నవదీప్ ముఖ్య పాత్రలో నటించిన స్టాలిన్ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టాలిన్ అనేది నా ఫేవరెట్ పేరు... స్టాలిన్ రష్యా నియంత... స్టాలిన్ పేరుతో చిరంజీవి గారు గతంలో ఓ సినిమా చేసి మంచి విజయం సాధించారు. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత స్టాలిన్ పేరును నేను వింటున్నాను అంటూ రాంగోపాల్ వర్మ తెలిపారు. 

 

 

 జీవ క్రియ సుమన్ నవదీప్ ముఖ్యపాత్రల్లో నటించిన స్టాలిన్ సినిమా ట్రైలర్ చాలా బాగుంది అంటూ రాంగోపాల్ వర్మ తెలిపారు.ఈ సినిమాలో జీవ చాలా ఈజ్ తో నటించాడు అని...ఈ  సినిమాలో  నవదీప్ లు కూడా విలన్ పాత్రలో ఎంతో భిన్నంగా కనిపిస్తుంది అంటూ రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చాడు. నాకు హీరోల కంటే విలన్లే ఎక్కువ ఇష్టం అంటూ తెలిపాడు రాంగోపాల్ వర్మ. కాగా ఈ సినిమాకి రతిని  శివ దర్శకత్వం వహించారు. అయితే తమిళంలో సీరు అని  తెలుగులో స్టాలిన్ టైటిల్ తో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. . ఇక ఈ కార్యక్రమంలో హాజరైన జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ... ఈ సినిమా జీవ కెరియర్లో రంగం సినిమా కంటే మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ తెలిపారు. 

 

 

 ఈ సందర్భంగా మాట్లాడిన హీరో జీవ.. మొదటినుంచి తెలుగు ప్రేక్షకులకు తో నాకు మంచి అనుబంధం ఉందని ... రంగం సినిమా నుంచి నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్నారు అంటూ తెలిపాడు. తెలుగు ప్రేక్షకులకు తెలుగు తమిళం అనే తేడా ఉండదని మంచి సినిమా వస్తే ఆదరిస్తారు అంటూ తెలిపారు హీరో జీవ. రామ్ గోపాల్ వర్మ  గారి సినిమాలు అంటే ఎంతో ఇష్టమని.. ఆయన దగ్గర డైరెక్షన్ నేర్చుకోవాలి  అనుకుంటున్నాను అంటూ జీవో చెప్పుకొచ్చారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన స్టాలిన్ సినిమా దర్శకుడు శివ... ఈ సినిమా తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా దృష్టిలో ఉంచుకుని కథ రాశామని... తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది అని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: