జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల మాస్టర్ ప్లాన్ లో చిక్కుకుని చంద్రబాబునాయుడు ఉక్కిరి బిక్కిరైపోతున్నారు.  తాజాగా  కర్నూలులో జగన్ ప్రతిపాదించిన హై కోర్టు ఏర్పాటుకు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంటే హై కోర్టు ఏర్పాటులో  చంద్రబాబు యూటర్న్ తీసుకున్నట్లే అని అందరికీ అర్ధమైపోయింది. ఇక మిగిలింది విశాఖపట్నంలో సచివాలయం ఏర్పాటు విషయాన్ని అంగీకరించటమే మిగిలుంది. విచిత్రమేమిటంటే కర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతించిన నేతలపై అప్పట్లో చంద్రబాబు మండిపడ్డారు. ఎవరూ బహిరంగంగా మాట్లాడద్దని కట్టడి చేసి చివరకు ఆయనే ఇపుడు యూటర్న్ తీసుకున్నారు.

 

విషయం ఏదైనా సరే యూటర్న్ లు తీసుకోవటం చంద్రబాబుకు కొత్తేమీ కాదన్న విషయం అందరికీ తెలిసిందే. అధికార పార్టీ చేసిన ప్రతిపాదన లేకపోతే నిర్ణయాన్ని ముందు అడ్డుగోలుగా వ్యతిరేకిస్తారు. అధికారపార్టీ నిర్ణయంపై జనాల్లో సానుకూలత ఉన్నా నోటికొచ్చినట్లు మాట్లాడేస్తారు. తర్వాత ఎప్పుడో అంటే చేతలు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా యూటర్న్ తీసుకుని ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా మాట్లాడుతారు.

 

పైగా యూటర్న్ తీసుకునే ముందు  అధికార పార్టీ తీసుకున్న నిర్ణయం తాము ఎప్పుడో తీసేసుకున్నట్లు బిల్డప్ ఇస్తారు. తాజాగా హై కోర్టు విషయం అలాగే మాట్లాడారు. తాము అధికారంలో ఉన్నపుడే కర్నూలులో ధర్మాసనం ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారన్న విషయం ఇపుడు చెబుతున్నారు. కర్నూలులో ధర్మాసనం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నట్లు చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదు. పైగా కర్నూలులో హై కోర్టు కానీ లేదా బెంచ్ కానీ  ఏర్పాటు చేయాలని బిజెపి డిక్లరేషన్ ప్రకటించినపుడు కూడా ఏమీ మాట్లాడలేదు.

 

సరే తర్వాత జగన్ అధికారంలోకి రాగానే కర్నూలులో హై కోర్టు ఏర్పాటు చేస్తానంటూ చేసిన ప్రకటనను చంద్రబాబు ఎంతగా వ్యతిరేకించారో అందరికీ తెలిసిందే. స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం ఏర్పాటును కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. జనాల మూడ్ ను చూసి పార్టీలో వ్యతిరేకత వచ్చిన తర్వాత చివరకు యూటర్న్ తీసుకున్నారు. ప్రతి విషయంలోను ముందు వ్యతిరేకించటం తర్వాత యూటర్న్ తీసుకోవటం అలవాటైపోయింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: