గత పన్నేడేళ్ళుగా తనపై అత్యాచారం చేస్తున్నారని ఇప్పుడు పోలీసులకు పిర్యాదు చేయడం కాస్తా విస్మయాన్ని కలిగించాం లేదు. మహిళా పట్ల జరుగుతున్నా అత్యాచారాలను సమూలంగా అరికట్టాల్సిందే. ఈ విషయంలో మగ మృగాలను బహిరంగంగా తగిన శాస్తి చేయాలి కూడా. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ మహిళా అత్యాచార ఘటన మాత్రం రాజకీయ అత్యాచారంగా పరిగణించాల్సిన అంశంగా ఉందని నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలోనే   రాజకీయ కుట్రలో భాగంగా తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అడ్వకేట్‌ రఘునందన్‌రావు  పేర్కొన్నారు. రామచంద్రాపురం ఠాణాలో తనపై  కేసు నమోదు చేయడాన్ని రాజకీయ కుట్రగా ఖండించిన రఘునందన్‌. ప్రశ్నించే వారిపై ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. హెచ్‌ఆర్‌సీకి వెళ్లి ఫిర్యాదు పత్రాలు తీసుకుంటానన్నారు.

ఇక అసలు విషయానికి వస్తే కాఫీలో మత్తు మందు కలిపి అత్యాచారం. నగ్నచిత్రాలు నెట్‌లో పెడతానంటున్నారు.12 ఏళ్లుగా నరకం చూపిస్తున్నారు. ఫిర్యాదు చేసినా స్పందించని పోలీసులు. కేసు నమోదుకు హెచార్సీ ఆదేశించినాసైబరాబాద్‌ సీపీకి మహిళ ఫిర్యాదు.  బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అడ్వకేట్‌ రఘునందన్‌రావు 12 ఏళ్లుగా తనపై అత్యాచారం చేస్తున్నారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. సోమవారం ఆమె సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ను కలిసి తనకు నరకం చూపిస్తున్న రఘునందన్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. 
 
ఆ తర్వాత పటాన్‌చెరులో అడ్వకేట్‌ రఘునందన్‌రావును సంప్రదించి.. పోషణ ఖర్చుల కోసం భర్తపై సంగారెడ్డి కోర్టులో కేసు (నం.16/2003) వేసింది. ఈ క్రమంలో 2007 డిసెంబరు 2న కేసు గురించి మాట్లాడేందుకు ఆఫీసుకు రావాలంటూ రఘునందన్‌ ఆమెను పిలిచారు. కేసు విషయం చర్చిస్తుండగా ఇంట్లోకి వెళ్లి కాఫీ తెచ్చి ఆమెకు ఇచ్చారు. అది తాగిన వెంటనే కళ్లు తిరుగుతున్నట్లు అనిపించింది. రఘునందన్‌ ఆమెను గదిలోకి తీసుకెళ్లబోగా విడిపించుకునేందుకు పెనుగులాడింది. అయినా ఆయన ఆమెను గట్టిగా పట్టుకుని గదిలోకి తీసుకెళ్లారు.

మెలకువ వచ్చాక తనపై అత్యాచారం జరిగిందని తెలుసుకున్న ఆమె రఘునందన్‌ను నిలదీసింది. ‘పోలీసు కేసు పెట్టినా, విషయం ఎవరికైనా చెప్పినా చంపేస్తా. నీ నగ్న చిత్రాలు నా దగ్గరున్నాయి. వాటిని ఇంటర్నెట్‌లో పెట్టి నీ జీవితాన్ని నాశనం చేస్తాన’ంటూ ఆమెను బెదిరించారు. ఎన్నోసార్లు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే రాజకీయ పలుకుబడితో, రౌడీలతో బెదిరించారు. గతేడాది మార్చిలో రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు (ఎస్‌ఆర్‌ 998/2019) చేయగా కేసు నమోదు చేసి, చర్య తీసుకోవాలని గత నెల 23న రామచంద్రాపురం పోలీసులను ఆదేశించింది.

అనంతరం ఆ మహిళ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా స్పందన లేకపోవడంతో సోమవారం కమిషనర్‌ను ఆశ్రయించింది. సీపీ ఆదేశాలతో రఘునందన్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ రమే్‌షకుమార్‌ తెలిపారు. ఈ ఆరోపణలను రఘునందన్‌ ఖండించారు. సజ్జనార్‌ ఆదేశాలతో రామచంద్రాపురం పోలీసు స్టేషన్‌లో రఘునందన్‌పై అత్యాచారం, బెదిరింపులు, ప్రాణహానికి సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. బాధిత మహిళ (47) ఫిర్యాదు ప్రకారం.. రామచంద్రాపురం ఠాణా పరిధి జ్యోతినగర్‌కు చెందిన ఆమె 2003లో భర్తపై పోలీస్‌ స్టేషన్‌లో గృహ హింస కింద కేసు పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: