భారత దేశంలో నెంబర్ వన్ మీడియా మేనేజింగ్ పొలిటిషయన్ ఎవరయ్యా అంటే వినిపించే మొదటి పేరు చంద్రబాబు. ఆయన ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన నాటి నుంచి నేటి వరకూ మీడియా మేనేజ్ మెంట్ ఆధారంగానే రాజకీయంగా లబ్ది పొందుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆయనకు ఆ రెండు పత్రిక సపోర్ట్ నిరాటంకంగా సాగిపోతోంది. కేవలం ఆ రెండు పత్రికలే కాదు.. మీడియా రంగంలో చంద్రబాబు ప్రభావం ఎంత ఎక్కువో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 

అయితే ఇప్పుడు చంద్రబాబుకు ఆ మీడియా అండ సరిపోవడం లేదు. అధికార పగ్గాలు అందుకున్న దగ్గర నుంచి చెలరేగిపోతున్న జగన్ ను అడ్డుకునేందుకు ఆ మీడియా సపోర్ట్ సరిపోవడం లేదు. అందుకే ఇప్పుడు చంద్రబాబు జాతీయ మీడియాను రంగంలోకి దించారు. తనకు ఉన్న పరిచయాలతో.. లాబీయింగ్ తో.. జాతీయ మీడియాలోనూ జగన్ సర్కారుపై నెగిటివ్ వార్తలు వచ్చేలా చూసి.. వాటి ఆధారంగా మళ్లీ ఏపీలో రాజకీయం మొదలుపెట్టారన్న వాదన.. మీడియా సర్కిళ్లో వినిపిస్తోంది.

 

జాతీయ మీడియాలో కథనాలు వచ్చేలా చూసుకోవడం.. ఆ తర్వాత వాటి ఆధారంగా ఏపీలో రచ్చ చేయడం ఇప్పుడు చంద్రబాబు కొత్త వ్యూహం. అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి. ఇటు సీఎం జగన్ కు కూడా సొంత మీడియా ఉంది. చంద్రబాబుకైనా ఆయన్ను సపోర్టు చేసే మీడియా ఉంది. కానీ జగన్ కు సొంతగానే మీడియా ఉంది. అంతే కాదు.. జాతీయ స్థాయిలో మీడియా పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన చాలా మంది మీడియా వ్యక్తులను సలహాదారులగానూ పెట్టుకున్నారు.

 

కానీ ఎప్పుడూ చంద్రబాబు తరహాలో జాతీయ స్థాయి మీడియాను మేనేజ్ చేయాలని మాత్రం జగన్ ప్రయత్నించిన దాఖలాలు కనిపించవు. మరి చంద్రబాబు పదే పదే చేస్తున్న ఈ పని.. ఎందుకు జగన్ సర్కారు చేయడం లేదు.. చంద్రబాబు తరహాలో జగన్ ఎందుకు మీడియాను మేనేజ్ చేయడం లేదు.. బహుశా ఇది.. జగన్ ఆత్మస్థైర్యం కావచ్చు. మీడియాను మేనేజ్ చేసినా.. ప్రజలకు అసలు విషయం తెలియకపోదన్న తెలివిడి కావచ్చు. ఏదేమైనా మీడియా మేనేజ్ మెంట్ లో చంద్రబాబు రెచ్చిపోతున్నా జగన్ మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: