ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదని అడిగితే కొందరు అమరావతి అంటారు.. మరికొందరు విశాఖ అంటారు. మరికొందరేమో ఏమో మాకు తెలియదు అంటారు. ఒక్క ప్రశ్నకి ఇన్ని రకాలుగా సమాధానం వస్తుందటే అక్కడ రాజధాని విషయంలో ఎంత గందరగోళం నెలకొందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడి హయాంలో అమరావతిని రాజధానిగా చేస్తూ అక్కడ పరిపాలన సౌకర్యాలు కూడా చేపట్టాడు.

 

 

 

 

కానీ ప్రస్తుతం ఆ నిర్మాణాలు ఆగిపోయాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. అయితే అమరావతి ప్రాంతంలో భూ వివాదాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ అధికార పక్షం వాదిస్తోంది. అలాంటిదేమీ లేదంటూ ప్రతిపక్షం సమర్థించుకుంటోంది. ఇన్ని వివాదాల నేపథ్యంలో అక్కడ భూ దందాల విషయమై ఈడీ విచారణ జరపనుంది.

 

 

సుమారు ౮౦౦ మంది భూముల గురించి విచారణ జరగనుంది. అయితే ఈడీ విచారణకి ఒక ప్రత్యేకత ఉంటుంది. సాధారణ సీబీఐ ఒక వ్యక్తి మీద విచారన చేస్తున్నప్పుడు అతడు అవినీతి పరుడని ఆధారలతో సహా చూపించాల్సి ఉంటుంది. కానీ ఈడీ విధానం అది కాదు. ఒక వ్యక్తి మీద ఈడీ విచారణ జరుపుతున్నప్పుడు ఆ వ్యక్తి అతను సంపాదించిన ఆస్తులు వగైరా అన్నీ సక్రమమైన మార్గంలోనే సంపాదించానని రుజువు చేసుకోవాలి.

 

 

 

అలా రుజువు చేసుకోని యెడల జప్తు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ౮౦౦ మంది తమకున్న ఆస్తి సక్రమమైనదే అని నిరూపించుకోవాల్సి ఉంటుంది. వారికి అంత డబ్బు ఎక్కడ నుండి వచ్చింది అన్న దగ్గర నుండి అన్ని పత్రాల్ని ఈడీకి సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎనిమిది వందల మంది తమకి వచ్చిన ఆస్తుల లెక్కలు చూపాల్సి ఉంటుంది.  మరి ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: