వన్య సంపద కనుమరుగైపోతున్నాయన్న ఆందోళన నేపథ్యంలో ఒక్కసారిగా కళ్ళెదుటకి వస్తే ఆ ఆనంద వేరుకదా. జింకలు కూడా అలానే చేశాయి. ఈ జింకలకు చరిత్రలో పెద్ద కధే ఉంది. రామాయణంలో మహా సాధ్వి సీతమ్మవారు కిడ్నాప్ కావడానికి ప్రధాన కారణమయ్యాయి. కృష్ణ జింక ఆనాడు బంగారు రూపంలో కనిపించి శ్రీ రామచంద్ర ప్రభు కుటుంబాన్ని తలోదారి చేసి చిక్కుల్లో పడేసింది. అంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న చూస్తే.. అప్పటికి ఇప్పటికి ఎవరైనా సరే ఎమరుపాటును గురికావాల్సిందే.

ఇక వర్తమానంలోకి వస్తే..  గతంలో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ మీద నుంచి రాకపోకలు సాగుతున్నప్పుడు గోదావరి లంకల్లోని ఇసుక తిన్నెలపై కృష్ణ జింకలు కనువిందు చేసేవి. అయితే మనుషుల స్వార్థానికి వందలాది జింకలు బలైపోతుండటంతోపాటు.. మిగిలినవి నరుల కంట కనపడకుండా దూరంగా జీవనం సాగిస్తున్నాయి.

రాజమహేంద్రవరానికి చెందిన రాకేశ్‌ పులప అనే జాతీయ డ్రోన్‌ ఫొటో గ్రాఫర్‌.. ఈ కృష్ణజింకల సందడిని క్లిక్‌ మనిపించాడు. ధవళేశ్వరం బ్యారేజీ సమీపంలో, కడియం మండలం వేమగిరితోట సమీపంలోని పులసల లంకలో కృష్ణజింకలు గుంపులు గుంపులుగా హల్‌చల్‌ చేస్తుండడాన్ని అబ్బురపరిచేలా చిత్రీకరించారు. కనుమరుగై పోతున్న కృష్ణజింకలు ఒకేసారి పదుల సంఖ్యలో దర్శన మివ్వ డంతో వన్యప్రాణిప్రియుల ఆనందానికి అవధులు లేవు.

నదీతీరాలలో విహరించడం సర్వసాధనమైన అంశమే. కానీ ఆయా తేరా ప్రాంతాల్లో మనుషులతో పాటుగా జింకలు కూడా విహరిచందేమీ చెప్పుకోతగ్గ విశేషం మరి. ఇంకేముంది అటు ప్రకృతి ప్రేమికులకు ఇటు వన్య సంరక్షకులు ఆనందానికి అడ్డు అదుపు లేకుండా పోయిందిగా.

కానీ వన్యప్రాణులను భక్షించే వాళ్లకు మాత్రం ఇదొక చక్కని అవకాశంగా భావిస్తారుగా. వన్యప్రాణులల్లో జింక మాంసాన్ని ముఖ్యంగా మందుబాబులు నంజుకుతింటారు మరి. ఈ కారణంగానే ప్రకృతి పాటు మనుషులను మంత్రముగ్ధులను చేసే ఈ వన్య సంపద సంతతి హరించుకుపోతుంది. ఈ ప్రమాదాన్ని నివారించండంలో ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భాల్లో విఫలమవుతున్నాయన్న విమర్శ లేకపోలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: