మరికొన్ని రోజుల్లో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో  ఫలితమెలా ఉంటుందోనని దేశమంతా ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ఎన్నో సర్వేలు ఈ ఎన్నికల ఫలితాలపై, రాజకీయ పార్టీల భవితవ్యంపై తమ తమ స్థాయిల్లో సర్వేలు చేశాయి. అయితే.. హైదరాబాద్ కు చెందిన ‘పీపుల్స్ పల్స్’ అనే సర్వే సంస్థ చేసిన సర్వే ఆసక్తికరంగా మారింది. ఈ ఫలితాలు అందరిలో ఆశ్చర్యంతో పాటు ఆసక్తి రేకెత్తిస్తోంది. కేవలం ఫలితాలపైనే కాకుండా అందుకు కారణాలు కూడా సవివరంగా వ్యక్తీకరించడంతో ఈ సర్వే చర్చనీయాంశమైంది.

 

 

ఈ సంస్థ చేసిన సర్వేలో ఈసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని విష్పష్టంగా తెలిపింది. అరవింద్ కేజ్రీవాల్ తన అధికారాన్ని నిలుపుకుంటూ సీఎంగా మళ్లీ ప్రమాణస్వీకారం చేస్తారని చెప్తోంది. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రవేశపెట్టి పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఓటర్ల తీరును స్పష్టం చేసింది. బీజేపీ విధానాలతో ఢిల్లీ ప్రజలు సంతృప్తిగా లేరని తెలిపింది. సీఏఏ, ఎన్ఆర్సీలపై ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు బీజేపీకి శాపంగా మారాయని అంటోంది. పైగా ఢిల్లీకి సీఎం అభ్యర్ధిగా కొత్త వ్యక్తిని ప్రకటించడం కూడా బీజేపీకి ప్రతికూలంగా మారిందని స్పష్టం చేసింది. ఢిల్లీలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి అధికారం దక్కదని సూటిగా చెప్తోంది.

 

 

ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే అసలు ఆ పార్టీ ఉనికే లేదని అంటోంది. షీలా దీక్షిత్ మరణంతో పాటే కాంగ్రెస్ కూడా కనిపించటం లేదని ఈ సర్వే సంస్థ అంటోంది. షీలా దీక్షిత్ మూడు సార్లు ఢిల్లీ సీఎంగా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టారు. ఆమె తర్వాత కాంగ్రెస్ కు అంతటి బలమైన అభ్యర్ధి లేడని కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని అంటోంది. ఈ కారణాలతో కేజ్రీవాల్ కు పోటీనిచ్చే వక్తి అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ లో లేరని అంటోంది. ఎన్నికలు ఈనెల 8న, ఫలితాలు 11న రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: