ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మేడారం జాతరపైనా ప్రభావం చూపిస్తోంది. లక్షల సంఖ్యలో జనం గుమిగూడే జాతర కావడం వల్ల.. ఎలాంటి వ్యాధులు ప్రబల కుండా తెలంగాణ సర్కారు ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. కేరళలో ఇప్పటి వరకూ 3 కేసులు నమోదు కావడంతో అన్ని రాష్ట్రాలూ ఉలిక్కిపడుతున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

 

తెలంగాణలో ఇప్పటి వరకూ ఒక్క కేసూ నమోదుకాలేదు. అయినా మన తెలంగాణ నుంచి వేర్వేరు దేశాలకు నిత్యం వందల మంది రాకపోకలు సాగిస్తున్నందున.. ఎప్పుడైనా కరోనా జాడలు కనిపించే ప్రమాదం పొంచి ఉంది. బుధవారం ప్రారంభం కానున్న మేడారం మహా జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే ఛాన్స్ ఉంది. అందుకే తెలంగాణ సర్కారు సన్నద్ధత ప్రదర్శిస్తోంది.

 

లక్షల మంది వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఇలాంటి చోట్ల వ్యాధులు జోరుగా వ్యాపిస్తాయి.

కరోనా అని నిర్ధారణ కాకపోయినా.. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలున్న వ్యక్తులు జాతరకు వెళ్లకపోవడమే మంచిది. సాధారణ ప్రజలు కూడా కచ్చితంగా మాస్కులు ధరించి జాతరలో పాల్గొంటే మంచిది. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించడానికి విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది.

 

ఇక కరోనా వైరస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే మంచిది.. మేడారం జాతరకు వెళ్లే వారు కానీ.. వెళ్లే ఆలోచన ఉన్నవారు కానీ.. తెలుసుకోవాల్సిన అవసం ఉంది. అదేంటంటే.. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి చీదినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది.

 

కరోనా వైరస్ ఉన్న వారు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం, ముక్కుచీదడం, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముఖానికి అడ్డంగా చేతులు పెట్టుకోకపోవడం, అవే చేతులతో ఇతరులను తాకడం, కరచాలనం చేయడం, వస్తువులను ముట్టుకోవడం వల్ల కూడా ఈ వైరస్ వ్యాపిస్తుంది. అందుకే జాతర సమయంలో దగ్గు జలుబు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: