అదేంటి.. ఏపీలో ఎన్నికలు జరిగి 8 నెలలు కూడా కావడం లేదుగా.. అప్పుడే ఎన్నికలేంటి అనుకుంటున్నారా..? జగన్ సీఎం కుర్చీలో ఇంకా కుదురుకోక ముందే అప్పుడే మళ్లీ ఎన్నికలేంటి అనుకుంటున్నారా.. అవును మరి.. మీకు అలా అనిపించడం లేదా.. అనిపించకపోతే అది కచ్చితంగా మీ తప్పే మరి. ఎందుకంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు హడావిడి చూస్తుంటే అప్పుడే ఏపీలో మళ్లీ ఎన్నికలు వచ్చేశాయేమో అనిపించడం లేదూ..?

 

లేకపోతే.. అప్పుడే ఎన్నికల ర్యాలీలను తలపించేలా.. చంద్రబాబు రోడ్ షోలు ఏంటి..? ఎన్నికలను గుర్తుకు తెచ్చేలా పాదయాత్రలేంటి.. అప్పుడే జగన్ సర్కారు పరిపాలన పూర్తయినట్టు.. గంటల తరబడి జగన్ పరిపాలన తీరును తూర్పారబడుతూ ఆ ప్రెస్ మీట్లు ఏంటి.. ఆ రాద్దాంతం ఏంటి.. ఇదంతా చూస్తుంటే మీరు ఏపీలో అప్పుడే ఎన్నికలు వచ్చేసినట్టు అనిపించడం లేదూ..

 

అప్పుడే ఎన్నికల సీజన్ వచ్చేసినట్టు టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ఈ హడావిడి చూసి చాలా మంది ఇలాగే అనుకుంటున్నారు. అప్పుడే ఎన్నికలు వచ్చేసినట్టు.. చంద్రబాబు రాజకీయ సమరానికి రెడీ అయిపోతున్నారు. ఇక ఈ జగన్ ప్రభుత్వం వేస్ట్.. శుద్ధ వేస్టు అంటూ తీర్మానించేస్తున్నారు. జగన్ పాలనలో రాష్ట్రం ఎంత అధోగతి పాలైందో గంటల తరబడి తన ఉపన్యాసాలతో పిచ్చెక్కించేస్తున్నారు.

 

ఈ చంద్రబాబు తీరు చూసి టీడీపీ నాయకులే విస్తుపోతున్నారు. బాబోయ్ బాబు గారు అప్పుడే మొదలెట్టేశాడేంట్రా బాబూ అని తలపట్టుకుంటున్నారు. చంద్రబాబు పర్యటన ఉందంటేనే ఆ జిల్లా టీడీపీ నాయకులు వణికిపోతున్నారు. ఇప్పటి నుంచే పోరాటం ఉధృతం చేస్తే.. జనం మన అతిని ఛీత్కరించుకుని అసలు సమయంలో పట్టించుకోకుండా మానేస్తారేమోనని భయపడిపోతున్నారు. కానీ..పాపం.. ఆ విషయం బాబుగారికి చెప్పే ధైర్యం మాత్రం ఎవరికి ఉంది..? అందుకే ఎవరికీ చెప్పలేక తమలో తామే మథన పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: