తెలుగుదేశం అధినేత చంద్రబాబు జగన్ సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. సోమవారం ప్రెస్ మీట్ నిర్వహించిన చంద్రబాబు జగన్ సర్కారు ఎమ్మెల్సీలను కొనేందుకు బేరం పెట్టిందంటూ విచిత్రమైన ఆరోపణలు చేశారు. మండలిలో ఆధిపత్యం కోసం ఎమ్మెల్సీను తమవైపు లాక్కునేందుకు జగన్ ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు. ఎమ్మెల్సీలకు రూ.10 కోట్లు, 20 కోట్లు బేరాలు పెట్టారని.. అయినా వారు అమ్ముడుపోకుండా ధైర్యంగా నిలబడ్డారని తమ ఎమ్మెల్సీని చంద్రబాబు ప్రశంసించారు.

 

ప్రజలు కూడా ఎమ్మెల్సీల్లా రాష్ట్రంకోసం బాధ్యత ప్రజలూ తీసుకోవాలని చంద్రబాబు కోరారు. అయితే అక్కడ ప్రెస్ మీట్లో ఉన్న జర్నలిస్టులందరికీ ఎమ్మెల్సీల బేరాలు అనగానే ఒక్కసారిగా పాత విషయాలన్నీ గుర్తుకొచ్చేశాయి. సరిగ్గా నాలుగేళ్ల క్రితం తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు తగినంత ఎమ్మెల్యేల మద్దతు లేకపోయినా చంద్రబాబు పోటీకి దించడం గుర్తొచ్చింది.

 

ఆ తర్వాత తక్కువ పడిన ఎమ్మెల్యేల సంఖ్యను కవర్ చేసుకుని ఎలాగైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం చంద్రబాబు చేసిన కుట్రలన్నీ గుర్తుకొచ్చేశాయి. చివరకు ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఇంటికి డబ్బు సూటు కేసు ఇచ్చి మరీ.. తమ నాయకుడు రేవంత్ రెవంత్ రెడ్డిని ఆయన ఇంటికి పంపిన విషయమూ గుర్తొచ్చింది.

 

అంతేనా.. స్టీఫెన్ సన్ కు ఫోన్‌ చేసి.. మనవాళ్లు బ్రీఫ్డ్ మీ.. మీకేం భయం లేదు. నేను మీతో ఉన్నా.. అంటూ భరోసాగా మాట్లాడిన మాటుల ఇంకా జర్నలిస్టుల చెవుల్లో మారు మోగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ అదే చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్సీను జగన్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు మాత్రం ఎలాంటి సాక్ష్యాలు లేవు. వాయిస్ రికార్డులతో సహా అప్పట్లో దొరికిపోయిన చంద్రబాబు మాత్రం చాలా అలవోకగా ఆరోపణలు చేసేస్తున్నారు. దీనినే.. దటీజ్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అనుకోవాలేమో మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: