ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు పెద్దరు.. ఎన్ని ఆస్తులున్న ఆరోగ్యానికి మించిన ధనం మనిషి దగ్గర ఏది ఉండదు అంటారు. ఎందుకంటే ఎన్ని లక్షల కోట్లు ఉన్నా అవి అనుభవించడానికి ఆరోగ్యం కావాలి. ఇదే లేకుంటే వాటికి విలువ ఉండదు. నేటి కాలంలో డబ్బుకు కొదువ లేదు, కానీ ఆరోగ్యం మాత్రం మనిషి చేతిలో ఉండటం లేదు. ఇకపోతే ఒకప్పుడు ఏదైనా జబ్బు చేస్తే మరణించే వారు. కాని నేటి కాలంలో దాదాపుగా అన్ని రోగాలకు మందులను మనిషి కనిపెట్టుకుంటున్నాడు. అయినా కొత్త కొత్త రోగాలు మనిషిని మట్టు పెడుతున్నాయి.

 

 

ఇదే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా మరణాలకు కారణమవుతున్న ప్రధాన వ్యాధుల్లో క్యాన్సర్‌ ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం రానున్న కాలంలో సుమారు 8.4 కోట్ల మంది క్యాన్సర్‌ కారణంగా చనిపోనున్నారని తేలిందట. ఈ వ్యాధిపై పోరాటం చేసి దాన్ని రూపు మాపడం ఏ ఒక్కరి వల్లనో సాధ్యం కాదు. అందుకే అంతా కలసి దాన్ని రూపుమాపుదాం అంటున్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు. ఇక క్యాన్సర్ పేరువింటే ఇప్పటికి వణికిపోతున్నారు జనం. వారి భయంలో అర్ధం ఉంది ఎందుకంటే అదో భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధి ఆరోగ్యాన్ని క్షీణిపజేయడంతో పాటు మానసికంగానూ దెబ్బతీస్తుంది.

 

 

అందుకే క్యాన్సర్‍‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ భయంకరమైన వ్యాధి శరీరంలోకి మిగతా భాగాలకూ సోకే ప్రమాదం ఉంది. ఇకపోతే ఇవాళ వాల్డ్ క్యాన్సర్ డే. ఈ క్యాన్సర్ డే సందర్భంగా పలు స్వచ్చంద సంస్దలు తమ ఆద్వర్యంలో ఎన్నో పోగ్రాంస్ నిర్వహిస్తారు. అవగహన కలిగిస్తారు. ఇకపోతే అమెరికన్ క్యాన్సర్ సొసైటీ, క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేసింది. క్యాన్సర్ తొలి దశల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఇక శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం, రెడ్ మీట్ తీసుకోవడం, సిగరెట్, మద్యం అలవాట్లు క్యాన్సర్‌కు దారితీస్తే ప్రమాదం ఉంది.

 

 

అందుకే 20-49ఏళ్ల మహిళలు స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. బ్రెస్ట్, సర్వికల్, కొలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ తప్పనిసరి. 55 ఏళ్లు దాటిన మహిళలకు లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ తప్పనిసరి. ఇక 20-39 ఏళ్ల పురుషులు కొలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. 40 ఏళ్లు దాటినవాళ్లు ప్రొస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ తప్పనిసరి. పొగతాగే అలవాటు ఉన్నవాళ్లు, 50 ఏళ్లు పైబడ్డవాళ్లు లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. పొగాకుకు దూరంగా ఉండటం మంచిది. బరువును అదుపులో ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలి. ఆటలు, డ్యాన్సింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ లాంటివి క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయి. వారానికి 150 నిమిషాల వ్యాయామం మంచిది. దాంతోపాటు ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారం తీసుకోవాలి. ఇక ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలంటే ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి, ఆలోచనలను ఎప్పుడు అదుపులో పెట్టుకోవాలి...  

మరింత సమాచారం తెలుసుకోండి: