మహాత్మాగాంధీ స్వాతంత్రం కోసం చేసిన పోరాటం మొత్తం ఒక నాటకమే అంటూ బిజెపి ఎంపీ అనంత్  కుమార్ హెగ్డే  చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దేశం మొత్తం స్వతంత్రాన్ని సాధించిన యోధుడిగా జాతిపితగా పిలుచుకునే మహాత్మాగాంధీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. గాంధీ నేతృత్వంలో భారత స్వాతంత్రోద్యమం ఒక నాటకమని.. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళతో సర్దుబాటు చేసుకోవడం తోనే స్వాతంత్రం వచ్చింది అంటూ బీజేపీ ఎంపీ అనంత కుమార్ వ్యాఖ్యానించారు. 

 


కేవలం గాంధీ మాత్రమే దేశానికి స్వతంత్ర తీసుకొచ్చినట్లు దేశ ప్రజలను నమ్మించారని ఇలాంటి వ్యక్తి ఎలా  మహా పురుషుడు అయ్యారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అనంతకుమార్ హెగ్డే.  కేవలం ఉపవాస దీక్షల తోనే పోరాటం చేసిన మహాత్మాగాంధీ మహా పురుషుడు అయితే దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు ఏమవుతారు అంటూ వ్యాఖ్యానించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వారిని చరిత్రలో ఏదో చీకటి మూల కుక్కేసి సత్యాగ్రహం చేసి దేశానికి స్వాతంత్రం తెచ్చిన ట్లు ప్రజలను నమ్మించారు అంటూ బిజెపి ఎంపీ అనంతకుమార్ హెగ్డే వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

 

అయితే బిజెపి ఎంపీ అనంత్ కుమార్ షిండే వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకు పడిన విషయం తెలిసిందే. బిజెపి ఎంపీ అనంతకుమార్ హెగ్డే పై దేశద్రోహ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. అయినా తుపాకీ పట్టుకునే  సంస్కృతిని నమ్ముకున్న నేతలకు  సత్యాగ్రహాన్ని ఎలా నమ్ముతారు అంటూ కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణ్దీప్ సింగ్ సూర్జేవాలా విమర్శలు గుప్పించారు. మరోవైపు అనంత్  కుమార్ షిండే వ్యాఖ్యలపై బిజెపి నాయకత్వం కూడా ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అయితే క్రమశిక్షణా చర్యల్లో భాగంగా బిజెపి ఎంపీ  కి పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు వెళ్ళినట్లు సమాచారం.

 

 ఇక తాజాగా గాంధీ నేషనల్ మూవ్మెంట్ బూటకం అంటూ బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి లోక్ సభ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా బిజెపి నేతలు రావణాసురుని వారసులు అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బీజేపీ ఎంపీ వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి.దీంతో  లోక్ సభ మొత్తం దద్దరిల్లింది.

మరింత సమాచారం తెలుసుకోండి: