ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ మరోసారి మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నారా  అంటే అవుననే అంటున్నారు రాజకీయ పండితులు. జగన్ సర్కార్ శాసన మండలి రద్దు నిర్ణయం తీసుకోవడంతో రెండు మంత్రి పదవులు ఖాళీ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోజా కు ఈ సారి క్యాబినెట్ బెర్త్ కాయం అయ్యేటట్టు కనిపిస్తోంది. అంతే కాకుండా మరో సీనియర్ నేత కూడా మంత్రి పదవి రాబోతున్నట్లు ఆంధ్ర రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో  ఇదే హాట్ టాపిక్ గా మారింది. అయితే గతంలోనే రోజా కు మంత్రి పదవి దక్కుతుందని అందరూ అనుకున్నప్పటికీ... ఇప్పుడు శాసన మండలి రద్దు  ద్వారా ఆ అదృష్టం రోజా దరిచేరనున్నట్లు సమాచారం . 

 


 ఇప్పటికే  శాసన మండలి రద్దు కు సంబంధించి తీర్మానాన్ని కేంద్రానికి పంపింది జగన్ సర్కారు. కేంద్రం నుండి  గ్రీన్ సిగ్నల్ వస్తే మాత్రం శాసనమండలిని రద్దు అయిపోతుంది. ఒకవేళ కేంద్రంలో శాసన మండలి రద్దు తీర్మానానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే... వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ గా ఉండి జగన్ క్యాబినెట్ లో చోటు సంపాదించిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ పదవులు పోయినట్లే. దీంతో వైసీపీ క్యాబినెట్ లో ఇద్దరు మంత్రి పదవులు ఖాళీ అవుతాయి. ఈ నేపథ్యంలో ఎప్పటినుంచో మంత్రి పదవి కోసం ఆశగా ఎదురు చూస్తున్నా ఎమ్మెల్యే రోజా కి ఈ రెండు మంత్రి పదవుల్లో  ఒకటీ  దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మరో మంత్రి పదవిని స్పీకర్ తమ్మినేని సీతారాం కు కట్టబెట్టాలని జగన్ సర్కార్ అనుకుంటున్నట్లుగా వైసిపి వర్గాల్లో చర్చించుకుంటున్నారు. 

 


 ఇక అసెంబ్లీ స్పీకర్ పదవిని తమ్మినేని  సీతారాం సొంత జిల్లాకు చెందిన సీనియర్ నేత ధర్మాన ప్రసాద రావుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. అంటే ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం కి మంత్రి పదవి ఇచ్చి... ధర్మాన ప్రసాద రావుకు స్పీకర్ పోస్ట్ ఇవ్వాలని జగన్ సర్కారు నిర్ణయించినట్టు ఊహాగానాలు వస్తున్నాయి. అంతేకాకుండా పార్టీలో కీలక నేతగా ఉన్న నగరి ఎమ్మెల్యే రోజా కు హోంశాఖ ఇస్తారు అని ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ పార్టీ నుంచి రోజా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆమెకు మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకోగా... పలు  సామాజిక సమీకరణాల దృష్ట్యా రోజాకి మంత్రి పదవి దక్కలేదు. అయినప్పటికీ మంత్రి హోదా ఉండే ఏపీఐఐసీ చైర్మన్ బాధ్యతలను కట్టబెట్టారు సీఎం జగన్. ఇక ఇప్పుడు మంత్రి పదవి దక్కబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: