ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా అంద‌రి దృష్టి దేశ రాజ‌ధాని న్యూఢిల్లీకి జ‌రుగుతోన్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌పైనే ఉంది. దేశ వ్యాప్తంగా లోక్‌స‌భ ఎన్నిక‌ల వ‌ర‌కు తిరుగులేని వ‌రుస విజ‌యాలు సాధిస్తోన్న మోడీ అండ్ టీం చాలా రాష్ట్రాల్లో మాత్రం చ‌తికిల‌ప‌డుతోంది. ఇక కొద్ది రోజులుగా వివిధ అసెంబ్లీల‌కు జ‌రుగుతోన్న ఎన్నిక‌ల్లో బీజేపీకి షాక్ త‌ప్ప‌డం లేదు. ఛ‌త్తీస్‌ఘ‌డ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, బిహార్‌, ఒడిశా, ఏపీ, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌, జార్ఖండ్ లాంటి కీల‌క రాష్ట్రాలు అన్ని బీజేపీ నుంచి జారిపోతున్నాయి. బెంగాల్లోనే బీజేపీకి గెలుపు సులువు కాదు.

 

జాతీయ స్థాయిలో ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వి వ‌ర‌కు మోడీ ముద్దు అంటున్నా..బీజేపీ వ‌ద్దు అనే వాళ్లు చాలా మందే ఉన్నార‌ని వివిధ రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు రుజువు చేస్తున్నాయి. ఇక దేశ రాజ‌ధానిలో కేజ్రీవాల్ మోడీ అండ్ బీజేపీకి కొర‌క‌రాని కొయ్య‌గా మారుతున్నారు. 2015లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఢిల్లీ అసెంబ్లీలో ఉన్న మొత్తం 70 సీట్ల‌లో ఆప్ ఏకంగా 67 సీట్లు గెలుచుకుంది. ఆ ఎన్నిక‌ల్లో బీజేపీ కేవ‌లం 3 సీట్ల‌తో స‌రిపెట్టుకుంటే.. కాంగ్రెస్ కేవ‌లం సున్నాకే ప‌రిమిత‌మైంది.

 

ఇక తాజా ఎన్నిక‌ల‌ను మోడీ అండ్ గ్యాంగ్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. కేజ్రీవాల్‌ను ఎలాగైనా ఓడించాల‌ని కంక‌ణం క‌ట్టుకుంది. అయితే ప్రీ ప్రోల్ స‌ర్వేలు మాత్రం బీజేపీకి షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఇప్ప‌టికే పీపుల్స్ స‌ర్వే షాక్ ఇచ్చింది. ఆప్‌కు తిరుగులేని విజ‌యం ఖాయ‌మ‌ని చెప్పింది. ఇక మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క స‌ర్వే సైతం బీజేపీకి షాక్ ఇచ్చేలా ఢిల్లీ ఫ‌లితాలు ఉంటాయ‌ని చెప్ప‌క‌నే చెప్పేసింది. ఢిల్లీలో బీజేపీకి షాక్ తప్పదని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ స్పష్టం చేసింది.

 

కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 54 నుంచి 60 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటుందని తేల్చింది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేవలం 10-14 సీట్లకే పరిమితం అవుతుందని స్పష్టం చేసింది. కాంగ్రెస్ కేవలం రెండు సీట్లకే పరిమితం అవుతుందని తేల్చింది. గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ ఢిల్లీలో ఉన్న ఏడు ఎంపీ సీట్లు క్వీన్‌స్వీప్ చేసింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీకి పట్టం కట్టిన ప్రజలు.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆమ్ ఆద్మీకే అధికారం ఇవ్వబోతుండడం విశేషంగా మారింది.

 

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఢిల్లీలో బీజేపీకి 46శాతం ఓటు బ్యాంకురాగా.. ఆప్ కు 38శాతం వచ్చింది. కానీ ఏడాదిలోనే ఆప్ ఇంత భారీగా పుంజుకుంటుందని టౌమ్స్ నౌ తేల్చింది. ఇక బీజేపీ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న పౌరసత్వ సవరణ చట్టం బీజేపీకి ప్లస్ గా మారినా ఓట్లను రాల్చలేదని సమాచారం. సీఏఏ ను ఢిల్లీ ప్రజలు ఏకంగా 71శాతం మంది సపోర్టు చేశారు. అయినా కేజ్రీవాల్ కే సపోర్టు గా నిలవడం విశేషం. దీనిని బ‌ట్టి ఢిల్లీలో కేజ్రీవాల్ క్రేజ్ ఎలా ఉందో తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: