మనిషి నిత్యం ఏదో ఒక ప్రయోగం చేస్తూ విశ్వాన్ని జయిస్తున్నారు.  అయితే కొన్నిసార్లు ఇలాంటి ప్రయోగాలు బెడిసి కొట్టిన సంఘటనలు కూడా ఉంటున్నాయి.  ముఖ్యంగా బయోకెమికల్స్ కి సంబంధించిన ప్రయోగాలు వికఠించి మనిషి నాశనానికి మూలం అవుతున్నాయి.  ఒకప్పుడు యుద్దాలు జరిగితే ఆయుధాలతో జరిపేవారని.. భవిష్యత్ లో అత్యంత ప్రమాదకరంగా కెమికల్ వార్ చేస్తారని అంటున్నారు.  అయితే చైనా ప్రయోగాల ఘని అంటారు.. ఇక్కడ చేస్తున్న ప్రయోగాలు ఎక్కడా చేయరు.  అయితే కొన్ని సార్లు ఇవి వికఠించిన ప్రమాదాలకు కూడా దారి తీస్తున్నాయి. తాజాగా చైనాలోని కుహాన్ నుంచి వ్యాపించిన  కరోనా వైరస్ అనేక కుటుంబాలను కకావికలం చేస్తోంది.  ప్రస్తుతం ప్రపంచ దేశాలను గజ గజ వణికిస్తుంది.  

 

కరోనా భారిన పడి ఇప్పటికే చాలా మంది చనిపోయారు. తాజాగా కరోనా ఎఫెక్ట్ వల్ల ఓ చిన్నారు ఆకలితో అలమటించి చివరికి ఒంటరిగా చనిపోయాడు. వివరాల్లోకి వెళితే.. చైనాలోని హుబేయ్ ప్రావిన్స్ కు చెందిన యాన్ జియావెన్ తన ఇద్దరు కుమారులతో కలిసి నివసిస్తున్నాడు. పెద్ద కుమారుడు యాన్ (17) జన్మతః సెరిబ్రల్ పాల్సీ వ్యాధి వచ్చింది. అతకు లేవలేడు.. వీల్ చైర్ కే పరిమితం అయ్యాడు.. అతని పరిచర్యలు మొత్తం వేరే వారు చూసుకోవాలి.  చిన్నకుమారుడు చెంగ్ (11) ఆటిజంతో బాధపడుతున్నాడు. తాను కన్న పిల్లల వైకల్యంతో మనోవేదన చెంది తల్లి ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి తండ్రే తల్లి పాత్ర పోషిస్తూ పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇటీవల జియావెన్ తన చిన్న కుమారుడితో కలిసి వుహాన్ వెళ్లివచ్చాడు. అప్పటినుంచి అస్వస్థతకు గురవడంతో వైద్యపరీక్షలు చేయించగా కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది.  

 

దాంతో ఆ ఇద్దరినీ ప్రత్యేక ఆసుపత్రికి తరలించడంతో పెద్ద కుమారుడు యాన్ ఇంట్లో ఒక్కడే ఉండిపోయాడు. తండ్రి, తమ్ముడు ఆసుపత్రిలో ఉన్నారు..  యాన్ ఇంట్లో ఉండటంతో అతన్ని చూసేవారు లేకుండా పోయారు. ఈ విషయం తెలుసుకొని జియావెన్ తన కొడుకు దీనావస్థ గురించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. బంధుమిత్రుల్లో ఎవరైనా అతడికి సాయం చేయాలని విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. కానీ అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది.. యాన్ ఆకలితో అలమటించి.. ఎవరైనా వస్తారని ఎదురు చూసి దయనీయ పరిస్థితుల్లో జనవరి 29న కన్నుమూశాడు. ఈ ఘటన మీడియా ద్వారా వెలుగు చూడడంతో ఇరువురు అధికారులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: