మంత్రి ఏంటి భార్యను వెతుక్కోవడం ఏంటి ? అంటే ఆ మంత్రి గారికి ఇంకా పెళ్లి అవ్వలేదా ? సంబంధాల కోసం తిరుగుతున్నారా ? ఇప్పటివరకు పెళ్లి కాకపోవడం ఏంటి ? పోన్లే ఇప్పటికైనా పిల్ల దొరికిందిలే అనుకుంటూ ప్రశ్న.. సమాధానం మీరే చెప్పేసుకుంటున్నారా ?  అయితే మీరు పప్పులో కాలేసినట్టే. అబ్బబ్బా..! టెన్షన్ పెట్టకుండా సంగతేంటో చెప్పవయ్యా అనుకుంటున్నారా ? ఏమీ లేదండి ఏపీ సమాచార శాఖ మంత్రిగారు తిరుమలకు వచ్చారు. మంత్రిగారు కదా హంగూ ఆర్భాటం ఉండడం కామనే కదా ! ఇక అయన చుట్టూ పార్టీ నాయకులు, పోలీసులు, ఇక చెప్పేది ఏముంది ? ఒకటే హడావుడి కదా !

 

 ఈ సందట్లో పడిపోయిన మంత్రిగారిని మీడియా వాళ్ళు వదులుతారా ? ఏదో ఒక ప్రశ్న అడుగుతూ ఉంటే మంత్రిగారు కూడా పిచ్చా పాటిగా మాట్లాడుతూ దర్శనాయికి వెళ్తున్నారు. అయితే అప్పటి వరకు మంత్రిగారి పక్కనే నడిచిన ఆయన భార్య ఆయన పక్కనుంచి తప్పుకుని వెనక్కి వెళ్లడంతో అప్పటివరకు తాపీగా నడుచుకుంటూ వస్తున్న మంత్రిగారు ఒక్క క్షణం పాటు ఉలిక్కిపడడమే కాకుండా తన భార్య ఎక్కడ అనుకుంటూ అటు ఇటూ కంగారుగా చూడడం.. ఆమె అకస్మాత్తుగా మంత్రిగారి పక్కకు వచ్చి నడవడంతో మంత్రి గారు ఒక్కసారిగా చిరునవ్వులు చిందించారు. 


ఇందంతా చుట్టూ ఉండి గమనిస్తున్న వారంతా చూసి మూసి మూసి నవ్వులు నవ్వారు. వారిని చూసి మంత్రి కూడా సిగ్గుపడుతున్నట్టుగా కనిపించారు. కెమెరాలు ఆపండయ్యా అంటూ ముందుకు కదిలారు. దీంతో మంత్రిగారు భార్యను వెతుకున్నారు అంటూ సదరు సన్నివేశాన్ని చుసిన వారంతా ఛలోక్తులు వేసుకున్నారు. అదన్నమాట సంగతి. మన అనుకున్నవారు ఒక్క క్షణం కనిపించకపోతే ఎంత కంగారు పెడతామో తెలియంది ఏముంది.. ? అందుకే ఎక్కడికైనా గుళ్లకు వెళ్ళినప్పుడు, టూర్లు వెళ్ళినప్పుడు ప్రతిక్షణం అప్రమత్తతగా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: