ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌కు జవసత్వాలు తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది కొత్త టీమ్‌. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఆ పార్టీ విభజన దెబ్బకు ఒక్క సీటు కూడా గెలవలేని స్థితికి చేరుకుంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న అధిష్టానం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆ కొత్త టీమ్‌ ఏం చేస్తుందనేదే ఇపుడు చర్చ.

 

ఏపీలో కాంగ్రెస్‌కు జవసత్వాలు నింపేందుకు టీమ్ రెడీ అయింది. మాజీ మంత్రి శైలజానాథ్‌, తులసిరెడ్డి, మస్తాన్‌ వలీదో కమీటీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమవైపు తిప్పుకోవాలని నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి బలపరిక్ష చేసుకోవాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. 

 

ఏపీలో 2004, 2009 ఎన్నికల్లో ఎదురు లేకుండా గెలిచిన కాంగ్రెస్.. విభజన కారణంగా అడ్రస్ కూడా లేకుండా పోయింది. 2014, 2019 ఎన్నికల్లో సారధ్యం వహించే నాయకులు కూడా కరువయ్యారు. ప్రస్తుత ఏపీ రాజకీయాలు క్షణక్షణానికి మారుతుండడంతో.. పుంజుకునేందుకు కొత్త కమిటీని వేసింది అధిష్టానం. కుల, మత సమీకరణాలు బేరీజు వేసుకుని అధ్యక్షుడితో పాటు ఇద్దరు కార్యనిర్వాహక అధ్యక్షులను ఎంపిక చేసింది.

 

కమిటీలో మాజీ మంత్రి శైలజానాథ్‌ అధ్యక్షుడిగా, తులసి రెడ్డి, మస్తాన్‌ వలీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమాకం అయ్యారు. గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా ప్రధాన అజెండాగా ఎన్నికలు జరగ్గా.. ఆ తర్వాత ఆ అంశం కాస్తా మరుగున పడింది. దీనిని మళ్లీ ఫోకస్‌ చేయాలని చూస్తోంది కాంగ్రెస్. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయాలని ఆలోచిస్తోంది కొత్త టీమ్‌. ప్రజల్లోనే ఉండాలని పథకాలు రచిస్తోంది. మునుపటి ఓటు బ్యాంకును తిరిగి చేజిక్కించుకునేందుకు సామాజిక వర్గాల వారీగా సమావేశాలు కూడా నిర్వహించనుంది కొత్త కమిటీ.

 

ఏపీసీసీకి కొత్త కమిటీలను ఏర్పాటు చేయటంతో పాటు యువతకు పెద్ద పీట వేయాలని భావిస్తోంది న్యూ టీం.  ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై తిరుగుబాటుకు సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల్లోని అన్ని స్థానాల్లో పోటీ చేసి  తమ ఓటు బ్యాంకు ఎలా ఉందో పరిక్షించుకోవాలనుకుంటుంది ఏపీ 
కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ, టీడీపీలపై వ్యతిరేకంగా ఉన్న ఓటును తమ వైపు మళ్ళించుకోవటానికి ఎత్తులు సిద్ధం చేస్తోంది. కాగా, కొత్త టీం ఎలా ముందుకు వెళ్తుందో.. రానున్న రోజుల్లో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: