ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయిన విషయం తెలిసిందే. అయితే తొలిసారి అధికార పీఠాన్ని ఎక్కిన జగన్...ఏ మాత్రం తగ్గకుండా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. పెన్షన్ల పెంపు, ఆటో డ్రైవర్లకు డబ్బులు, రైతు భరోసా, కాపు నేస్తం, అమ్మఒడి, చేనేత కార్మికులకు సాయం, మత్స్యకారులకు సాయం...ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేశారు. ఇక జగన్ కొత్త పథకం అమలు చేయడం ఆలస్యం, ఆ పథకాన్ని తన నియోజకవర్గ ప్రజలకు అందించడంలో కైకలూరు వైసీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ముందున్నారు.

 

జగన్‌ని ఫాలో అవుతూ, తమ ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలకు పూర్తి అవగాహన కలిగించి వాటిని అందిస్తున్నారు. అలాగే ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైన ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పడంలో ముందున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో అతి పెద్ద స్థాయిలో ఉన్న ఆక్వా రంగానికి చేయూత అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా రంగంలో ముందున్న కైకలూరుని మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు జగన్ ప్రభుత్వం రూపాయిన్నరకే యూనిట్ కరెంట్ అందించడం వల్ల అక్కడి రైతులకు బాగా లబ్ది చేకూరుతుంది.

 

ఇక కైకలూరు అభివృద్ధికి కూడా దూలం బాగా కృషి చేస్తున్నారు. మండవల్లి మండలంలో దాదాపు 2 కోట్ల విలువైన డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణానికి పూనుకున్నారు. అటు ముదినేపల్లి మండల పరిధిలోని అల్లూరు, శింగరాయపాలెం, కొర్రగుంట. శ్రీహరిపురం పంచాయతీ శివారు చేవూరుపాలెం, పెదగొన్నూరు, వణుదుర్రు గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజ్‌లు, వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టారు.  ఇటు కైకలూరు మున్సిపాలిటీ కానుండటంతో నియోజకవర్గ అభివృద్ధి మరింత ముందుకెళ్లనుంది.

 

లోకల్‌గా ప్రతిపక్ష టీడీపీని అడ్డుకుంటున్న దూలం రాష్ట్ర స్థాయిలో హైలైట్ కాలేదు. అటు అసెంబ్లీలో కూడా ఈయన పెద్దగా హైలైట్ అయిన సందర్భాలు లేవు. ఇక ముఖ్యంగా ప్రస్తుతం రాజకీయం తిరుగుతున్న మూడు రాజధానులపై కైకలూరులో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు మూడుకు జై అంటే...మరికొందరు అమరావతినే కావాలని అంటున్నారు.  ఇక మొత్తం మీద చూసుకున్నట్లైతే కైకలూరులో దూలం నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా బాగానే పనిచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: