జనవరి 6వ తేదీన చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎన్నో గుర్తుండిపోయే సంఘటనలు... ఎంతో మంది ప్రముఖుల జననాలు... ఎంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి... !

 

 సింగపూర్ : 1819 ఫిబ్రవరి 6వ తేదీన సర్ థామస్ స్టామ్ఫోర్డ్ రాఫెల్స్  సింగపూర్ పట్టణాన్ని కనుగొన్నాడు. సింగపూర్ ఒక అతి చిన్న ద్వీపం. అంతేకాకుండా ఇది నగరం దేశం కూడా. మలేషియాకు దక్షిణాన ఉంది ఈ సింగపూర్. 704 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దక్షిణాసియాలోని అతి చిన్న దేశం సింగపూర్. 

 

 ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ జననం : బాద్షా ఖాన్ గా  సరిహద్దు గాంధీ గా పేరుగాంచిన స్వతంత్ర సమరయోధుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1890 ఫిబ్రవరి 6వ తేదీన జన్మించారు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గాంధేయవాది. అంతేకాకుండా భారతరత్న పురస్కారాన్ని పొందిన తొలి భారతేతరుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఎర్ర చొక్కల ఉద్యమం ప్రారంభించిన ప్రముఖుడు ఈ బాద్షా ఖాన్. భారత విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన వారి లో ఈయన ప్రముఖులు. భారత రాజకీయ నాయకులతో కలిసి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు ఈయన . ముఖ్యంగా గాంధీ నెహ్రూ మరియు కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాటం చేశారు. అయితే సరిహద్దు ప్రాంతంలోని ముస్లిం లీడర్లు అందరూ ఇతన్ని  ముస్లిం ద్రోహి అని హత్యాయత్నం కూడా చేశారు. అయితే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ దేశవిభజన ఆగలేదు దీంతో సరిహద్దు ముస్లింల అందరికీ ద్రోహిగా మారిపోయాడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. 

 

 విలియం పి  మర్ఫీ  జననం : రక్తహీనత వ్యాధికి చికిత్స ను కనుగొన్న శాస్త్రవేత్త విలియం పి  మర్ఫీ 1892 ఫిబ్రవరి 6వ తేదీన జన్మించారు. 

 

 భమిడిపాటి రామగోపాలం జననం: ప్రముఖ తెలుగు రచయిత పత్రికా సంపాదకుడు అయిన భమిడిపాటి రామగోపాలం 1932 ఫిబ్రవరి 6 వ తేదీన జన్మించారు. ఈయనకు ఆంధ్రపత్రిక అన్న రేడియో అన్న  ఎంతగానో ఇష్టం ఉండేది . కాగా ఈయన  78 ఏళ్ల వయసులో రెండు కాళ్లు వేళ్ళు పడిపోవడంతో... సహాయకులకు మౌఖికంగా చెబుతూ సాహితీ వ్యాసంగాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు భమిడిపాటి రామగోపాలం. చక్రాల కుర్చీకే పరిమితమైనా సాహిత్య వ్యాసంగం ఏ మాత్రం ఆపలేదు ఈయన . 2010 ఏప్రిల్ 7వ తేదీన భమిడిపాటి రాజగోపాల్ గుండెపోటుతో పరమపదించారు. 

 

 

 కె.వి.కృష్ణకుమారి జననం : తెలుగు రచయిత్రి సాహితీవేత్త గైనకాలజిస్టు అయినా కె.వి.కృష్ణకుమారి 1947 ఫిబ్రవరి 6వ తేదీన జన్మించారు. అయితే కె.వి.కృష్ణకుమారి అసలు వృత్తి మెడికల్ ప్రాక్టీషనర్ అయినప్పటికీ ప్రవృత్తి మాత్రం రచనా వ్యాసంగం. ఈమె తన పది సంవత్సరాల వయస్సు అప్పుడే రచనా వ్యాసంగాన్ని ప్రారంభించింది. ఈమె ఐదు దశాబ్దాలకు పైగా రచయిత్రిగా కొనసాగుతూ చిరస్మరణీయమైన గ్రంధాలను వెలువరించారు. ఈమె డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు కు ఆత్మీయురాలు, కుటుంబ సభ్యురాలు. కాగా  కృష్ణకుమారి ఆవిష్కరించిన మనిషిలో మనిషి అన్న గ్రంథం ఇప్పటికీ బహుళ ప్రజాదరణ పొందుతోంది. అంతేకాకుండా పుట్టపర్తి సాయిబాబా మీద రాసినటువంటి అద్వైతామృత వర్షిని అనే గ్రంధం కూడా ఎంతో మంది భక్తులు అమితంగా ఇష్టపడుతుంటారు. 

 

 కావలి ప్రతిభాభారతి జననం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు కావలి ప్రతిభాభారతి 1956 ఫిబ్రవరి 6వ తేదీన జన్మించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ మొట్ట మొదటి మహిళా అధ్యక్షురాలిగా రికార్డు సృష్టించారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కూడా కావలి ప్రతిభా భారతి పనిచేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున కీలక నేతగా ఎదిగిన కావలి ప్రతిభాభారతి పలుమార్లు మంత్రి పదవులు చేపట్టడమే కాదు అసెంబ్లీ స్పీకర్ గా కూడా కొనసాగారు. ఓ దళిత కుటుంబం నుంచి వచ్చినా కావలి ప్రతిభాభారతి రాజకీయంగా ఎంతగానో ఎదిగారు. 

 

 జోసెఫ్ ఫ్రీస్ట్ లి  మరణం : ఆక్సిజన్ వాయువు ను కనుగొన్న శాస్త్రవేత్త జోసెఫ్ ప్రీస్ట్లీ. ఈయన 1804 ఫిబ్రవరి 6వ తేదీన మరణించారు. 

 

 మోతిలాల్ నెహ్రూ మరణం : ప్రముఖ భారతీయ స్వతంత్ర సమరయోధుడు భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడైన మోతీలాల్ నెహ్రూ 1931 ఫిబ్రవరి 6వ తేదీన మరణించారు. ఈయన బలీయమైన రాజకీయ కుటుంబ వ్యవస్థాపకుడు. స్వాతంత్రోద్యమంలో ఎన్నో ఏళ్ల పాటు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు.

 

 కల్పనా రాయ్ మరణం : ప్రముఖ తెలుగు హాస్య నటి అయిన కల్పనా రాయ్ ఎన్నో సినిమాల్లో హాస్య నటిగా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. 2008 ఫిబ్రవరి 6వ తేదీన మరణించారు. ఓ సీత కథ చిత్రంతో తెలుగు తెరకు రంగ ప్రవేశం చేసిన కల్పనా రాయ్ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హాస్యనటిగా తెలుగు ప్రేక్షకులను అలరించారు. మొత్తంగా 450 తెలుగు చిత్రాలలో నటించారు కల్పనా రాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: