ఉప్పు నిప్పులా ఏపీలో రాజకీయ పోరాటం చేస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు, వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ మధ్య రాజకీయా వైరం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకీయ పరంగా ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటున్నారు. జగన్ కు ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రజా పోరాటాలు, ఉద్యమాలు చేస్తుంటే ... చంద్రబాబును ఇరుకున పెట్టే విధంగా ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ జగన్ ముందుకు వెళ్తున్నారు. ఒకరి రాజకీయ పతనం కోసం మరొకరు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇటువంటి వైరం కొనసాగుతుండగానే చంద్రబాబు కోసం ప్రత్యేకంగా పూజలు చేయించేందుకు వైసీపీ ప్లాన్ చేసుకోవడం వైరల్ గా మారింది.


 ఇంతకీ చంద్రబాబు కోసం వైసిపి ఎందుకు పూజలు చేయిస్తోంది అంటే అమరావతి విషయంలో అడుగడుగున అడ్డం పడుతూ ఉండడమే కాకుండా...  ప్రజల్లో లేనిపోని భయాందోళనలతో గందరగోళం సృష్టించేందుకు చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. వాస్తవ పరిస్థితులు వైసీపీ తరఫున వివరించేందుకు ప్రయత్నిస్తున్నా చంద్రబాబు ఆయన అనుకూల మీడియా ప్రభుత్వంపై బురద జల్లుతూ అసత్య కథనాలు ప్రచారం చేస్తోంది. దీనికి విరుగుడుగా నే ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం పై సానుకూల దృక్పథం ఏర్పడేలా, మూడు రాజధానులు ఆవశ్యకత ప్రజలకు అర్థమయ్యేలా వైసిపి సరికొత్త వ్యూహానికి తెరతీసింది. 


దీనిలో భాగంగానే ఈనెల ఆరో తేదీన మానవహారాలు, ఏడో తేదీన కొవ్వొత్తుల ర్యాలీ, 8వ తేదీన 'చంద్రబాబుకు బుద్ధి రావాలి' అంటూ పూజలు చేయించేందుకు వైసీపీ ప్లాన్ చేసుకుంది. అదేవిధంగా ఈ నెల 10వ తేదీన అన్ని జిల్లాల్లో మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడం, 12వ తేదీన వంటావార్పు కార్యక్రమం నిర్వహించడం, 13వ తేదీన రిలే నిరాహార దీక్షలు,14 న గులాబీలు, కరపత్రాలు పంపిణీ చేయడం, 15న అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం సమర్పించడం, ఇలా వినూత్న కార్యక్రమాలు చేపట్టేందుకు వైసిపి ప్లాన్ చేసుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: