ఫిబ్రవరి 7వ తేదీన ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే... ఎన్నో ముఖ్య సంఘటనలు ఇంకా ఎంతో మంది జననాలు మరెంతో మంది మరణాలు జరిగాయి... మరి ఒకసారి చరిత్రపుటల్లో కి వెళ్లి చూసి నేడు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 కృష్ణకాంత్ సింగ్ : ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా కృష్ణకాంత్ సింగ్ 1990 ఫిబ్రవరి 7వ తేదీన నియమితులయ్యారు. భారత ఉపరాష్ట్రపతి గా కూడా ఈయన  పనిచేశారు. రాజకీయాల్లో ఎంతగానో ఎదిగిన ఆయన ఎన్నో ఉన్నత పదవులు చేపట్టారు. 

 

 చార్లెస్ డికెన్స్ జననం : ప్రసిద్ధి గాంచిన ఆంగ్ల నవలా రచయిత అయిన చార్లెస్ డికెన్స్ 1812 ఫిబ్రవరి 7వ తేదీన జన్మించారు.ఈయన  గొప్ప సామాజిక కార్యకర్త. విక్టోరియా సామ్రాజ్యం ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు పారిశ్రామిక విప్లవం అభివృద్ధి చెందుతున్న రోజుల్లో చార్లెస్ డికెన్స్ మొదటి తరం రచయిత. ఈయన  గొప్ప ఆంగ్ల రచయితల్లో  ఒకరిగా  కొనియాడబడిన వారు.  ఎన్నో ఆసక్తికర కథనాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. 

 

 

 వేటూరి ప్రభాకరశాస్త్రి జననం : ప్రసిద్ధ తెలుగు కవి భాషా పరిశోధకులు చరిత్రకారులు అయిన వేటూరి ప్రభాకరశాస్త్రి 1918 ఫిబ్రవరి 7వ తేదీన జన్మించారు. ఈయనా ఎన్నో రచనలను కూడా రచించారు. అంతేకాకుండా ఈయన రేడియో నాటక రచయిత మరియు తెలుగు సంస్కృత పండితుడు. తెలుగు చారిత్రక సాహిత్య నిర్మాణానికి ఎంతగానో  గుర్తింపు తెచ్చిన వారిలో ప్రముఖులు. ఎంతో మేధావి. వేటూరి ప్రభాకర శాస్త్రి తన 12వ ఏట ఇతర భాషల్లో కవితలు రాసిన అనన్యుడు. తెలుగు భాషా సంతానములో  వేటూరి ప్రభాకర శాస్త్రి స్మరణీయులు. ఈయన తెలుగు భాషలో ఎన్నో కావ్యాలను రచించాడు. వివిధ గ్రంథాలు కూడా రచించాడు వేటూరి ప్రభాకర శాస్త్రి. ఇప్పటికీ వేటూరి ప్రభాకర శాస్త్రి రచించిన ఎన్నో రచనలకు ప్రేక్షకాదరణ ఉంటుంది. 

 

 

 కప్పగళ్ళు సంజీవ మూర్తి జననం : ప్రముఖ తెలుగు రచయిత అయిన కప్పగళ్ళు సంజీవ మూర్తి  1884 ఫిబ్రవరి 7 వ సంవత్సరంలో బళ్ళారి లో జన్మించారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఈయన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాడు. కేవలం ఉపాధ్యాయ వృత్తి తోనే సరిపెట్టుకోకుండా తెలుగు ప్రజలకు ఎన్నో రచనలు సఅందించారు  కప్ప గళ్ళు సంజీవా మూర్తి . ఈయన రాసిన రచనలు ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. ఈయనా 1962 జూన్ 13వ తేదీన మరణించారు.

 

 

 పి సుదర్శన్ రెడ్డి జననం : నిజాం పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఏళ్ల పాటు స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న పి  సుదర్శన్రెడ్డి 1925 ఫిబ్రవరి 7వ తేదీన జన్మించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా ఎంతో మంది ప్రజల్లో చైతన్యం కలిగించే స్వతంత్రోద్యమంలో  ముందుకు నడిచేలా  చేశారు.

 

 ఆమంచర్ల గోపాలరావు మరణం : స్వతంత్ర సమరయోధులు చరిత్రకారులు చలన చిత్ర దర్శకులు అయినా ఆమంచర్ల గోపాలరావు 1969 ఫిబ్రవరి 7వ తేదీన మరణించారు.

 

 గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు... గాలి ముద్దుకృష్ణమ నాయుడు 2018 ఫిబ్రవరి 7వ తేదీన మరణించారు. టిడిపి పార్టీలో సీనియర్ నాయకుడిగా పలు పదవులు నిర్వహించాడు. పుత్తూరు శాసనసభ నియోజకవర్గం నుంచి ఏకంగా ఆరు సార్లు ప్రాతినిధ్యం వహించాడు గాలి ముద్దుకృష్ణమనాయుడు. అంతేకాకుండా పలు పర్యాయాలు మంత్రిగా కూడా పనిచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: