ఈరోజు మధ్యాహ్నం జరిగిన ప్రెస్ మీట్ లో వైఎస్సార్ కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ వారికి మేము ఏంటో చూపిస్తాం అన్నట్లుగా మాట్లాడారు. ముఖ్యంగా శాసనమండలిలో వారి తీరును తప్పుబడుతూ సెలెక్ట్ కమిటీ విషయంలో తెలుగుదేశం పార్టీ వారు మాట మార్చారని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ఆయన చాలా చాకచక్యంగా మండలి చైర్మన్ ఇన్ డైరెక్ట్ గా పొడుస్తూ మాట్లాడిన మాటలు చాలా ఆసక్తికరంగా మరియు రాబోయే రోజుల్లో వైసీపి వారు ప్రవర్తించే తీరుని వెల్లడించేలా ఉన్నాయి.

 

చంద్రబాబు దగ్గర చైర్మన్ ఎలా ప్రవర్తించినా మరియు అతని తోలు బొమ్మలాగా పనిచేసినా కూడా మేము మాత్రం ఆయనకు ఇవ్వవలసిన గౌరవం ఇస్తున్నామని బొత్స చెప్పిన మాటలు టిడిపి వర్గాలకు గట్టిగా తగిలాయి. అలాగే తాను తప్పు చేస్తున్నాను అని చెప్పి మరీ చైర్మన్ సెలెక్ట్ కమిటీకి మూడు రాజధానులు విషయాన్ని పంపడాన్ని బొత్స సత్యనారాయణ తీవ్రంగా తప్పుపట్టాడు. చివరికి మేము ఎన్ని రకాలుగా తగ్గినా కూడా వారు సెలెక్ట్ కమిటీ విషయంలో మళ్లీ మాట మార్చారు అని బొత్స తీవ్రమైన విమర్శలు చేశాడు.

 

ఇక నుండి ప్రభుత్వం కూడా వారికి ఉండే విచక్షణ ప్రకారం ముందుకు వెళుతుంది అన్న ఆయన మాటలు వింటుంటే అని మీరు చేసిన మోసాన్ని తిరిగి అదే రకంగా సరైన పద్దతిలో చేసి చూపిస్తాం  అన్నట్లు ఉన్నాయి బొత్స మాటలు. ఇకపోతే ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి రాజ్యాంగంలో ఉన్న ఒక నొసుగు ని అడ్డం పెట్టుకొని విశాఖపట్నం నుంచే పరిపాలన చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: