తన ఐదేళ్ళ అధికారంలో మిగిలిన రాష్ట్రాన్ని ఎండగట్టి  కేవలం అమరావతికి మాత్రమే చంద్రబాబునాయుడు ఏ స్ధాయిలో దోచిపెట్టాడో తెలుసా ?  మొత్తం 13 జిల్లాలకు విస్తరించాల్సిన అభివృద్ధిలో చాలా భాగం అమరావతికి తీసుకెళ్ళాడు.  అభివృద్ధి మొత్తాన్ని ఒకేచోకట కేంద్రీకృతం చేయటం ద్వారా తాను, తన మద్దతుదారులు, బినామీలు, సన్నిహితులు కొనుగోలు చేసిన వేలాది ఎకరాల ధరలు పడిపోకుండా ఇపుడు అమరావతి పేరుతో నానా రచ్చ చేస్తున్నాడు.

 

అసలు రాజధానిగా అమరావతిని సెలక్ట్ చేయటమే దురుద్దేశ్యంతో  చేశారు. దాంతో తర్వాత చేసిన ప్రతి అభివృద్ధిని సొంత లాభం కోసమే చేసుకున్నాడు. అందుకనే  అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్, హైకోర్టు ఒకేచోట పెట్టాడు. శివరామకృష్ణన్ కమిటి ఏ పద్దతిలో అయితే  వద్దని చెప్పిందో దానికి విరుద్దంగా మొత్తం అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకృతం చేయటంలో కేవలం సొంత లాభం తప్ప మరేమీ కనబడలేదు.

 

ఏ స్ధాయిలో అమరావతిలో అభివృద్ధిని కేంద్రీకృతం చేశారనేందుకు కొన్ని ఉదాహరణలు చూడచ్చు.  ప్రముఖ విద్యాసంస్ధ విఐటి యూనివర్సిటిని అమరావతిలోనే పెట్టారు. చెన్నై కేంద్రంగా నడిచే ఎస్ఆర్ఎం యూనివర్సిటినీ కూడా అమరావతిలోనే పెట్టారు. అమృత యూనివర్సిటికి కూడా కేరాఫ్ అడ్రస్ అమరావతే.  సుమారు 10 వేల ఉద్యోగులు పనిచేయగలిగే దేశంలోనే ప్రిస్టేజియస్ సంస్ధ  ఎయిమ్స్ ను కూడా చివరకు అమరావతికే తీసుకెళ్ళారు.

 

తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో నిర్మించాలని అనుకున్న దేశంలోనే అతిపెద్ద  శ్రీవారి   దేవాలయం కూడా  అమరావతిలోనే శంకుస్ధాపన చేశారు. ఇక ప్రభుత్వ పరంగా చూస్తే 25 మంది మంత్రుల శాఖలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలు కూడా అమరావతిలోనే ఉంది. పోలీసు హెడ్ క్వార్టర్స్ ఎలాగూ అమరావతిలోనే ఉంటుంది.

 

తిరుపతిలో నిర్మించాల్సిన అతిపెద్ద క్యాన్స్రర్ ఆసుపత్రి కూడా అమరావతి దగ్గరకే తీసుకెళ్ళిపోయాడు. విచిత్రమేమిటంటే తిరుపతిలో నిర్మాణం కోసం కేంద్రమంత్రి శంకుస్ధాపన చేసిన తర్వాత కూడా ఆసుపత్రిని తరలించేశాడు.  విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు నిర్వహించి పెట్టుబడులను మాత్రం అమరావతిలో పెట్టాలని కోరిన ఘనుడు చంద్రబాబు.

 

అంటే హైదరాబాద్ కేంద్రంగా చేసిన తప్పునే మళ్ళీ చంద్రబాబు అమరావతిలో కూడా చేయాలన్నదే టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఎందుకంటే వేలాది ఎకరాల ఇన్ సైడర్ ట్రేడింగ్ తో వేల కోట్ల రూపాయలు లబ్ది పొందాలని అనుకున్నాడు కాబట్టే. ఇప్పుడర్ధమైందా చంద్రబాబు ఎందుకని అమరావతి జపం చేస్తున్నాడో ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: