అవును టీడీపీ అధినేత చంద్రబాబుకు కోపమొచ్చేసింది.. తెలుగు మీడియా అంటేనే విరక్తి పుట్టేసింది. జగన్ సర్కారు ఇన్ని ఆగడాలు చేస్తున్నా.. మీరు ఏమీ రాయలేక పోతున్నారు..అంటూ మీడియాపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు కూడా బాధ్యత ఉంది.

ఏం రాష్ట్రం అన్యాయం అవుతుంటే మీకు పట్టదా అంటూ జర్నలిస్టులకూ చంద్రబాబు క్లాసు పీకేశారు. జాతీయ మీడియా జగన్ గురించి ఆయన చేసే అడ్డగోలు పాలన గురించి రాస్తుంటే లోకల్ మీడియా అయ్యుండి మీరు రాయలేరా.. అంటూ జర్నలిస్టుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేసారు చంద్రబాబు.

 

పాపం.. మళ్లీ ఆయనే తేరుకుని.. ఇక్కడి పత్రికలు రాస్తే ఎల్లో జర్నలిజం అంటారు. కులాలు అంటగడతారు.. జాతీయ మీడియాకు అలాంటివేవీ లేవు. అందుకే.. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ సామాజిక బాధ్యతతో సంపాదకీయాలు రాస్తున్నారు..అంటూ సానుభూతి చూపించేశారు. మీరు రాయకపోయినా సరే.. నేను పోరాడుతూనే ఉంటా.. ఆరోగ్యం బాగుంటే నేను ఇంకో 15 నుంచి 20 ఏళ్లు ఉంటా.. మీకు వద్దనుకుంటే నాకూ అవసరం లేదు.. భావితరాల భవిష్యత్తు ఆలోచించుకోండి. రక్షించుకుంటారా? లేదా? అనేది మీ ఇష్టం.. అంటూ మరోసారి పాత్రికేయులకు క్లాస్ పీకేశారు.

 

పాపం..అప్పటికే చంద్రబాబు ఉపన్యాసం గంటన్నరకు పైగా విన్న జర్నలిస్టులు.. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు చంద్రబాబు కోపం తమపైకి వచ్చేసరికి గుడ్లు తేలేశారు. ఇదేం ట్విస్టురా నాయనా అనుకున్నారు. మొత్తానికి ప్రెస్ మీటు అయ్యిందనిపించారు. ఆ ట్విస్టు నుంచి కోలుకున్న కొందరు జర్నలిస్టులకు మరో విషయం గుర్తొచ్చింది. ఇప్పటికే జగన్ సర్కారు అక్రమాలపై చంద్రబాబు ఆస్థాన పత్రికలు ఎలాగూ రాస్తున్నాయి కదా.. అయినా బాబుగారికి ఎందుకు కోపం వచ్చిందన్న అనుమానం వచ్చింది.

 

అయితే ఆ రెండు పత్రికలే పదే పదే రాయడం వల్ల జనం పట్టించుకోవడం మానేశారేమో.. అందుకే మిగిలిన పత్రికలు కూడా రాస్తే అప్పుడైనా జనం నమ్ముతారని చంద్రబాబు భావిస్తున్నారేమో అనుకుని సర్థుకుని అక్కడ నుంచి బతుకు జీవుడా అ బ యట పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: