బొత్స సత్యనారాయణ...ఏపీ మంత్రి. విజయనగరం వైసీపీకి పెద్ద దిక్కు. ఈయన చుట్టూనే అక్కడ రాజకీయాలు తిరుగుతాయి. అసలు విజయనగరం పేరు చెబితే...తన పేరు గుర్తొచ్చేలా బొత్స అక్కడ పట్టు తెచ్చుకున్నారు. కాంగ్రెస్‌లో ఉండగానే ఆయన విజయనగరంలో పెత్తనం చేసేవారు. 1999లో పాత బొబ్బిలి పార్లమెంట్ నుంచి గెలిచిన బొత్స, 2004, 2009 లో చీపురుపల్లిలో కాంగ్రెస్ నుంచి గెలిచి వైఎస్సార్ మంత్రివర్గంలో పని చేశారు. వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్‌లో కీ రోల్ పోషించి ముందుకు తీసుకెళ్లారు. పి‌సి‌సి అధ్యక్షుడుగా పని చేస్తూ ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పారు.

 

అయితే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పరిస్తితి దారుణమైపోవడంతో 2014లో బొత్స కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇలాగే ఉంటే లాభం లేదు అనుకుని తర్వాత వైసీపీలోకి వచ్చేశారు. ఇక్కడ నుంచి స్లోగా వైసీపీలోకి ముందు వచ్చిన నేతలని సైడ్ చేసి ఈయన డామినేషన్ చేయడం మొదలుపెట్టారు. 2019లో గెలిచి మంత్రి అయ్యాక విజయనగరం పూర్తిగా ఈయన అధీనంలోకి వచ్చింది.

 

ఇక ఇక్కడ నుంచే వైసీపీకి అసలు తిప్పలు మొదలయ్యాయని తెలిసింది. బొత్స డామినేషన్ కొంతమంది నేతలకు నచ్చడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీలో ముందు నుండి ఉంటున్న సీనియర్ నేత రాజన్న దొర తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని విజయనగరం వైసీపీ శ్రేణుల్లో ప్రచారం వచ్చింది. కీలక పదవులు వచ్చే విషయంలో బొత్సనే అడ్డుపడుతున్నారని రాజన్న ఆగ్రహంగా ఉన్నారట. బొత్స తన మేనల్లుడుకు ఎక్కువ ప్రాధాన్యత ఇప్పించుకోవాలనే చూస్తూ...తనకు చెక్ పెడుతున్నారని ఇన్నర్‌గా ఫీల్ అవుతున్నారట.

 

ఇక ఇదే సమయంలో యంగ్ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి వర్గానికి, బొత్స వర్గానికి పడటం లేదట. జిల్లాలో ఎక్కువ బొత్స వర్గం డామినేషన్ ఉండటంతో పుష్పశ్రీ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. అలాగే వైసీపీలో ముందు నుంచి ఎమ్మెల్యేలు బొత్స పట్ల అసంతృప్తి రాగాలు తీస్తున్నట్లు తెలిసింది. మొత్తం మీద బొత్స వల్ల విజయనగరం వైసీపీ తిప్పలు పడుతుందని అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: