ఒకే ఒక ప్రకటనతో రాష్ట్రంలోని ప్రతిపక్షాల నోళ్ళన్నీ మూత పడిపోయాయి.  మూడు రాజధానుల ఏర్పాటు, శాసనమండలి రద్దు తీర్మానం విషయంలో కేంద్రప్రభుత్వం తాజాగా చేసిన ఓ ప్రకటన  చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, వామపక్షాలు, బిజెపి నేతల నోళ్ళు మూయించేసింది. రాజధాని ఏర్పాటు, శాసనమండలి రద్దు విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదంటూ ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ మంత్రి స్పష్టంగా చేసిన ప్రకటనతో అందరూ షాక్ తిన్నారు.

 

జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనతో చంద్రబాబు, పవన్, వామపక్షాలు, బిజెపి నేతలు ఎంతగా రెచ్చిపోతున్నారో అందరూ చూస్తున్నదే. నిజానికి జగన్ ప్రకటన తర్వాత చంద్రబాబు రాజధాని అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో జనాలను బాగా రెచ్చగొట్టి ఉద్యమంలోకి లాగారు. రాజధాని నిర్మాణానికి 29 గ్రామాల్లోని రైతులు భూములిస్తే గోల జరుగుతున్నది మాత్రం కేవలం ఓ ఐదారు గ్రామాల్లో మాత్రమే.

 

దాంతో ఏమి చేయాలో దిక్కు తోచని చంద్రబాబు రాష్ట్రంలోని జనాలను రెచ్చ గొట్టటానికి తీవ్రంగానే ప్రయత్నించారు. ఇందులో భాగంగానే మచిలీపట్నం, తిరుపతి, నరసరావుపేట లాంటి ప్రాంతాల్లో తిరిగి జోలెపట్టి విరాళాలు కూడా సేకరించారు. సరే ఎంతగా ప్రయత్నించినా ఉపయోగమైతే కనబడలేదు. దాంతో అజ్ఞాత మిత్రుడు పవన్ తో కూడా చెప్పి నోటికొచ్చినట్లు మాట్లాడించారు.

 

బిజెపితో పొత్తు పెట్టుకుని జగన్ ను అడ్డుకుందామని గట్టిగానే ప్రయత్నించారు. సరే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా చివరకు కేంద్రం మాత్రం రాజధానుల ఏర్పాటు, మండలి రద్దుతో తమకేమీ సంబంధం లేదని పార్లమెంటు సాక్షిగా తేల్చి చెప్పేసింది. ఇంతకాలం ఏ సుజనా చౌదరి ద్వారానో లేకపోతే పవన్ కల్యాణ్ ద్వారానో  జగన్ కు బ్రేకులు వేద్దామని చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఎందుకు పనికిరాకుండా పోయాయి. తాజాగా కేంద్రం హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ చేసిన ప్రకటనతో అందరి నోళ్ళు ఒక్కసారిగా మూతపడిపోయాయి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: