వల్లభనేని వంశీ...ఓ రెండు నెల క్రితం...రాష్ట్రంలో ఈయనే పెద్ద హాట్ టాపిక్. ఎన్నో ఏళ్లుగా టీడీపీలో కీలక నేతగా ఉన్న వంశీ..2009లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి, 2014లో గన్నవరం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇక 2019 లో కూడా టీడీపీ నుంచే రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే టీడీపీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీకి దూరంగా జరుగుతూ వచ్చారు. అయితే ఊహించని రీతిలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారనే ఆరోపణలు పెరగడంతో, ఒక్కసారిగా వైసీపీలో ఉన్న తన సన్నిహితుడు మంత్రి కొడాలి నానితో కలిసి సీఎం జగన్‌తో భేటీ అయ్యి, మళ్ళీ కొన్ని రోజులు సైలెంట్‌గా ఉండి, చివరికి బాబుపై విమర్శలు చేసి జగన్‌కు మద్ధతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.

 

అయితే వైసీపీలో చేరకపోయినా, పార్టీ అనుబంధ సభ్యుడుగా మెలుగుతున్నారు.  ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్న గన్నవరం మామూలుగానే టీడీపీకి కంచుకోటలా ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో రానున్న స్థానిక సంస్థల్లో వంశీ వైసీపీ అభ్యర్ధులని మెజారిటీ స్థాయిలో గెలిపించే ప్రయత్నం చేసి తన సత్తా నిరూపించుకోవాలి. అలా కాని పక్షంలో వంశీకి ఇబ్బందికర పరిస్తితులు వస్తాయి. ఇక వీటిని అధిగమించేందుకు వంశీ  ఓ సూపర్ స్కెచ్ వేశారని తెలుస్తోంది.

 

రానున్న స్థానిక సంస్థల్లో టీడీపీ గెలిచే సత్తా ఉన్న పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి స్థానాల్లో, తనకు అనుకూలంగా ఉండే అభ్యర్ధులనే టీడీపీ ద్వారా పోటీ చేయించి, గెలిచాక వైసీపీలోకి తీసుకొచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఆ మేరకు ఇప్పటికే స్కెచ్ వేశారని సమాచారం. మొన్న వంశీతో పాటు కొందరు స్థానిక టీడీపీ నేతలు వైసీపీలోకి రాలేదు. వారిని తన అనుకూలంగా మార్చుకుని..వంశీ స్థానిక సంస్థల్లో సత్తా చాటాలని చూస్తున్నట్లు తెలిసింది.  మరి చూడాలి వంశీ అసలు ఎలాంటి స్కెచ్ వేశారో? ఆ స్కెచ్ లోకల్ ఎన్నికల్లో ఏ మేర ఫలిస్తుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: